2 మిలియన్ల వ్యూస్‌: ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న యువతి

3 Jun, 2021 18:02 IST|Sakshi
ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న యువతి

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో

నెటిజన్లను ఫిదా చేస్తోన్న యువతి

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా వల్ల కీడు ఎంత ఉందో.. మేలు కూడా అంతే ఉంది. తక్షణ సాయం లభించాలన్న, రాత్రికి రాత్రే స్టార్‌ అవ్వాలన్నా సోషల్‌ మీడియాతోనే సాధ్యం. కన్ను గీటుతో ప్రియా వారియర్‌, అద్భుతమైన గాత్రంతో రేణు ముండాల్‌, నీలి కళ్లు, అందమైన రూపంతో ఉన్న అర్షద్‌ ఖాన్‌ లాంటి వారందరిని సోషల్‌ మీడియా రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మార్చింది. తాజాగా ఈ జాబితాలోకి మరో యువతి చేరింది. తన అందమైన రూపంతో ఇంటర్నెట్‌ని ఫిదా చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోని ఇప్పటివరకు 2 మిలియన్ల మంది వీక్షించారు. 

జాస్మిన్‌ సైని అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఓ యువతి కట్టెల పొయ్యి ముందు కూర్చుని.. చేతలతో చాలా అలవోకగా రొట్టెలు చేస్తుంది. యువతి వెనక కుక్కలు, పిల్లలు ఆడుకోవడం చూస్తే.. ఏదో పల్లెటూరులా అనిపిస్తుంది. ఇక ఈ వీడియోని చూస్తున్నంతసేపు యువతి ముఖం మీద నుంచి చూపు తిప్పుకోలేరు. ఇక వీడియోని చూసిన వారంతా మరో సోషల్‌ మీడియా సెలబ్రిటీ.. నీ ముందు హీరోయిన్‌లు కూడా దిగదుడుపే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: వైరల్‌: మోదీ సార్‌.. మాకెందుకీ కష్టాలు

A post shared by jasmeen saini (@jasmeen_sainii)

మరిన్ని వార్తలు