Viral Video: డ్రగ్స్‌ మత్తులో యువకుడు.. రోడ్డుపై తూలుతూ..15 రోజుల్లో రెండో ఘటన

24 Sep, 2022 16:50 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లో ఈ మధ్య ఓ మహిళ డ్రగ్స్‌ మత్తులో తూలుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అమృతసర్‌ నియోజకవర్గంలోని పంజాబ్‌లోని డ్రగ్స్‌ మత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది జరిగి 15 రోజులు అవ్వకముందే అదే అమృత్‌సర్‌లో మరో ఉదంతం వెలుగు చూసింది. అమృత్‌సర్‌ తూర్పు నియోజకవర్గంలోని చమ్రాంగ్‌ రోడ్‌లో ఓ యువకుడు రోడ్డుపై తూలుతూ కదలలేని స్థితిలో నిలబడి ఉన్నాడు. కనీసం ముందుగా అడుగు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నడిరోడ్డుపై వెళ్తున్న వారందరూ అతన్నే చూస్తూ ఉన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఆ వ్యక్తి స్మాక్‌ ప్రభావంలో(డ్రగ్స్‌ మత్తులో) ఉన్నట్లు చుట్టూ ఉన్న వారు చెబుతుండటం వీడియోలో వినిపిస్తోంది. స్మాక్‌ అనేది ఓపియాయిడ్‌ డ్రగ్‌, దీనినే కొన్నిసార్లు బ్లాక్‌ టార్‌ హెరాయిన్‌ అని కూడా పిలుస్తారు. ఇక సిక్కుల పవిత్ర నగరమైన మక్బూల్‌పురా.. మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి తరచుగా వార్తల్లో నిలుస్తుంది. మద్యం మానేసేందుకు పోలీసులు అనే డి- అడిక్షన్‌ డ్రైవ్‌లు చేపట్టినటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. 

ఈనెలలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో దాదాపు కనీసం 350 మంది డ్రగ్స్‌ స్మగ్లర్స్‌ను అరెస్ట్‌ చేశారు.  వీరి నుంచి పోలీసులు. 6.90కేజీల హెరాయన్‌, 14.41 కేజీల నల్ల మందు, 5 కేజీల గంజాయి, 6.44 క్వింటాళ్ల గసగసాల పొట్టు, 2.10 లక్షల మాత్రలు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్లు, ఫార్మా ఓపియాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

మరోవైపు రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగం ఎక్కువవడంతో పంజాబ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా ఇంకా కొనసాగుతుందని, దీనికి ఇలాంటి ఘటనలే నిదర్శమని విమర్మిస్తున్నాయి.

మరిన్ని వార్తలు