Baba Ramdev: సల్మాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడు.. బాబా రాందేవ్‌ సంచలన వ్యాఖ్యలు

16 Oct, 2022 16:31 IST|Sakshi

లక్నో: యోగా గురువు బాబా రాందేవ్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో రాందేవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌, డ్రగ్స్‌ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని ఆరోపించారు. ఆమిర్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటారా? లేదా? అనేది తనకు తెలియదన్నారు. షారుక్‌ ఖాన్‌ కొడుకు డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తూ.. వాళ్ల గురించి దేవుడికి మాత్రమే  తెలుసని అన్నారు. 

యావత్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ డ్రగ్స్‌ గుప్పిట్లో చిక్కుకుందని ఆరోపించారు. ‘సినిమా పరిశ్రమను డ్రగ్స్‌ చుట్టుముట్టింది. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోంది. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలి. దీని కోసం మేము ఉద్యమం చేస్తాం’ అని వెల్లడించారు. రాందేవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణానంతరం బీటౌన్‌ స్టార్స్‌ డ్రగ్స్‌ వాడకంపై  తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాందేవ్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు