Viral Video: ఉదయ్‌పూర్‌ హత్య కేసు నిందితులపై దాడి

2 Jul, 2022 21:21 IST|Sakshi

జైపూర్‌: ఉదయ్‌పూర్‌ టైలర్‌ కన్హయ్యలాల్‌ హత్య కేసులో నిందితుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసును జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీ విచారిస్తోంది.  నిందితులను విచారణలో భాగంగా జైపూర్‌లోని ఎన్‌​ఐఏ కోర్టుకు తరలించారు. పోలీసులు  కోర్టు ప్రాంగణం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది జనాలు పోలీసులను దాటుకొని కోర్టు వెలుపల నిందితులపై దాడికి దిగారు.  నిందితులను పట్టుకొని పక్కకు లాగి దాడికి యత్నించారు. ఈ దాడిలో వారి బట్టలు చిరిగిపోయాయి. అయితే వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు అతికష్టం మీద నిందితులను వ్యాన్‌లోకి ఎక్కించి జైలుకు తరలించారు. మరోవైపు కోర్టు నిందితులకు జులై 12 వరకు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. 

కాగా బీజేపీ నేత నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపిన టైల‌ర్ క‌న్హ‌య్య‌ను పట్టపగలే ఇద్ద‌రు వ్య‌క్తులు కత్తితో పొడిచిన విష‌యం తెలిసిందే. దీనిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.ఈ కేసులోని ఇద్దరు నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మొహ‌మ్మ‌ద్‌ల‌ను 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు.  పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ దావ‌త్ ఎ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధం ఉన్న‌ట్లు రాజస్థాన్‌ పోలీసులు అనిమానిస్తున్నారు. 
చదవండి: కుప్పకూలిన ప్రభుత్వం.. బోసిపోయిన శివసేన కార్యాలయాలు

మరిన్ని వార్తలు