వైరల్‌: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు

24 Jun, 2021 15:55 IST|Sakshi

మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. ఇక అదే మొసలి నీటిలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లేనని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే. అంతెందుకు ఆకారంలో పెద్దగా ఉండే ఏనుగు కూడా నీళ్లలో మొసలికి చిక్కితే దాని పరిస్థితి దబిడిదిబిడే మరి. కానీ నాకివన్నీ తెలియదు భయానికి​ మీనింగ్‌ తెలియని బ్లడ్‌ నాది అన్నట్లు ప్రవర్తించింది ఓ కొంగ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది.

ఓ కొం‍గ మొసలిని చూసి భయపడటం కాదు కదా ఏకంగా దాని మీద ఎక్కి మరీ సవారీ చేసింది. అంతేనా, ఆ కొంగ ఎంచక్కా రైడ్‌ చేస్తున్నట్లు ఫోజులిస్తూ మనకు కనిపిస్తుంది. ఇంతలో అనుకోకుండా అక్కడికి మరో రెండు మొసళ్ళు వచ్చాయి. అవి ఈ కొంగ పని పడతాయని అనుకున్నారు ఈ వీడియో చూసిన వాళ్లంతా  కానీ, ఆ మొసళ్ళు కూడా కొంగను చూసి సైలెంట్‌గా వెళ్లిపోయాయి. అలానే కొంగ నిల్చున్న మొసలి కూడా ఏమీ ఆ పక్షిని గాయపరచకుండా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువెళ్లడం మరో వింత. మామూలుగా అయితే ఇలాంటి సంఘటనలు జరగడం అరుదు. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కొందరు ఆ కొంగ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు ఆ మొసలి, కొంగ స్నేహితులేమో అని కామెంట్స్ పెడుతున్నారు.
 

చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు