క్షమాపణలు కోరిన బ్రిటిష్‌ హై కమిషనర్‌: వీడియో వైరల్‌

12 Aug, 2022 15:08 IST|Sakshi

న్యూఢిల్లీ: యూకే వీసా అనుమతుల్లో జాప్యం విషయమై భారత్‌లోని బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ స్పందించారు. వీసాలు అనుమతుల్లో జాప్యం గురించి వివరిస్తూ ట్విట్టర్‌ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ మేరకు అలెక్స్‌ వీడియోలో....యూకే వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎల్లిస్‌ ఇలా అన్నారు.

" మీలో చాలా మంది 15 రోజుల పని నిమిత్తం యూకేకి వెళ్లడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి పలు వీసా అప్లికేషన్స్‌ వచ్చాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్‌కి సమయం​ పడుతోంది. ఈ ఆలస్యం కారణంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. కోవిడ్‌ అనంతరం యూకే వీసాలకు డిమాండ్‌ పెరింగింది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్‌ల యుద్ధం వల్ల కూడా ఈ డిమాండ్‌ మరింత ఎక్కువైందని చెప్పారు.

అలాగే ఈ వీసా ప్రక్రియ వేగవంతం చేసుకునేలా ప్రజలకు శిక్షణ ఇస్తాం. మొదటగా చాలాముంది ప్రాదాన్యత ఇచ్చే వీసా సేవనే మీకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మీ వద్ద కావల్సిన సరైన పత్రాలు ఉన్నయని నిర్థింరించడంలో మాకు సహకరించండి. అలాగే మీ వీసా సురక్షితంగా ఉండే వరకు మీ విమాన టిక్కెట్‌కు కట్టుబడి ఉండొద్దు.

యూకే వీసాలు పరిమితి గడువులోగా మంజూరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కేవలం సందర్శకుల వీసాలు జారీ చేయడానికే ప్రస్తుతం ఆరువారాల సమయం పడుతుంది. కొన్నిరకాల వీసా అప్లికేషన్లకు మూడువారాలకు పైగా పట్టొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ఈ వీసాలు జారీ చేసేలా తాము కృషి చేస్తున్నాం" అని అన్నారు. 

(చదవండి: International Youth Day 2022: యంగిస్తాన్‌!)

మరిన్ని వార్తలు