ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్‌ చిందులు, వైరల్‌ వీడియో

27 Apr, 2021 16:38 IST|Sakshi

ఖరగ్‌పూర్‌: కరోనా సంక్షోభ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు, జూమ్‌ మీటింగ్‌లో తప్పనిసరిగా మారిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థుల కష్టాలు అన్నీ కావు.  తాజాగా ఒక ఐఐటీ ప్రొఫెసర్‌ విద్యార్థులపై విరుచుకు పడింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సీమా సింగ్‌ ఆన్‌లైన్‌క్లాస్‌లో విద్యార్ధులతోపాటు, వారి తల్లిదండ్రులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది.  ప్రస్తుతం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఆన్‌క్లాస్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లీష్‌ క్లాస్‌ చెప్తూ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించింది. విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా దూషణలకు దిగింది. ‘మీరు నా పై కంప్లయిట్‌ ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. వీలైతే సెంట్రల్‌ మినిష్టర్స్‌కు కూడా కంప్లయిట్‌ ఇచ్చుకోండి’ అంటూ ఆమె విద్యార్ధులపై చిందులు వేసింది. అంతేకాదు పరీక్షలో ఫెయిల్‌ చేస్తానని విద్యార్థులను బెదిరించిన వైనంప పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

మరొక వీడియోలో విద్యార్థి తాతా చనిపోయినందుకు పరీక్ష నుంచి మినహాయింపు కోరగా, ప్రొఫెసర్‌ ఆ విద్యార్థిని దూషించింది. ‘నేను కూడా హిందువునే నాకు మన సంప్రదాయాలు, కట్టుబాట్లు నాకు తెలుసు. కోవిడ్‌ సమయంలో ఇలాంటివి ఎక్కువగా ఎవరూ చేయడం లేదంటూ’ ప్రొఫెసర్‌ సీమాసింగ్‌ విద్యార్థిపై  మండిపడింది. మరో వీడియోలో క్లాస్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులు భారత్‌ మాతా కీ జై అనగా, వారిపై ‘మీరు దేశానికి ఇది తప్ప ఇంకొటి చేయాలేరా’అంటూ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విద్యార్థుల మార్కులు నా చేతిలో ఉన్నాయంటూ వారిని బెదిరించింది. కాగా ఈ తతంగాన్ని ఐఐటీ విద్యార్థులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌  చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. కాగా ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు.   

చదవండి: మే 2 తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేదం: ఈసీ

మరిన్ని వార్తలు