బెంగాల్‌లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

11 May, 2021 07:46 IST|Sakshi

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రాష్ట్రంలో హింసాత్మక ఘ‌ట‌న‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియ‌స్ అయింది. బెంగాల్‌లో హింసకు  సంబంధించి నివేదిక స‌మ‌ర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గ‌వర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం న‌లుగురు స‌భ్యుల‌తో క‌మిటీ వేసిన సంగ‌తి తెలిసిందే.

కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో చెలరేగిన హింస దృష్ట్యా కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటుచేయనుంది. 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన సువేందు అధికారికి జెడ్‌ కేటగిరీ భద్రతను కొనసాగించే అవకాశం ఉంది.
చదవండి: Tamil Nadu: పెత్తనం.. పళనిదే!

మరిన్ని వార్తలు