భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!

20 Nov, 2021 12:26 IST|Sakshi

ఒక్కోసారి కొంత మంది భక్తిలో పరవశించుపోతూ చేసే కొన్ని పనులు మనకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి ఆ స్థాయి మరి ఎక్కువగా చేరితే ఇక వారి వింత ప్రవర్తనతో జనాలను విసిగిస్తుంటారు. అయితే అచ్చం అలానే ఇక్కడొక పూజారి చేశాడు.

అసలు విషయంలోకెళ్లితే..ఒక పూజారి ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచిత్రంగా అభ్యర్థించాడు. ఈ మేరకు అతను తన కృష్ణుడి చిన్ననాటి విగ్రహమైన లడ్డూ గోపాల్ విగ్రహానికి స్నానం చేయిస్తున్నప్పుడు చేయి విరిగిపోయిందని అందువల్ల చికిత్స చేయాలంటూ ఏడుస్తూ అభ్యర్థిస్తాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. అయితే మొదటగా ఎవరు అతని అభ్యర్థనను పట్టించుకోరు.

కానీ కాసేపటికి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించి పేషంట్‌ పేరు కృష్ణుడిగా రిజిస్టర్‌లో నమోదు చేసుకుని. పూజారి సంతృప్తి నిమిత్తం విగ్రహానికి కట్టుకట్టామని తెలిపారు. అయితే పూజారి లేఖ్ సింగ్ అర్జున్ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.  

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!)

మరిన్ని వార్తలు