వైరల్‌: అరే ఇటు చూడండ్రా.. నన్నే వదిలేసి వెళ్లిపోతారేంట్రా?

22 Oct, 2021 16:37 IST|Sakshi

జీవితంలో నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. కొన్ని ఇతరులు చెప్పడం వల్ల తెలిస్తే మరికొన్ని సొంత అనుభవాల ద్వారానే బోధపడుతుంటాయి. కేవలం మనుషులతోనే కాదు, ప్రకృతి, జంతువుల ద్వారా కూడా బోలేడు విషయాలు నేర్చుకోవచ్చు.. తాజాగా అలాంటి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిన్న చీమలకు సంబంధించిన విషయం మావవ జీవితానికి ఎలా ముడిపడి ఉందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. 
చదవండి: ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’ 

వీడియోలో మూడు చీమలు ఒక పెద్ద ఆకు మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ మూడింటిలోఒక చీమ కింద నుంచి సాయం చేస్తుండగా మిగతా రెండు చీమలు ఆకు పైకి ఎక్కేస్తుంటాయి. రెండు చీమలు ఆకు ఎక్కిన తరువాత వీటికి సాయం చేసిన చీమను మాత్రం ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాయి. దీనిని బెన్‌ ఫిలిప్స్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు.
చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ

‘ఇది ఇప్పటివరకు చేసిన అత్యంత బాధాకరమైన సినిమా’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 4 మిలియన్ల వ్యూవ్స్‌ సంపాదించింది. దీనిని చూసిన నెటిజన్లు చిన్న చీమల వీడియో వెనక పెద్ద జీవిత సత్యం దాగుందంటూ కామెంట్‌ చేస్తున్నారు. చివరికి మిగిలిన చీమ పట్ల జాలిపడుతూ, ప్రస్తుతం మనుషులు కూడా ఇలాగే తయారయ్యారని పేర్కొంటున్నారు. మరికొంత మంది‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారే’ అంటూ ట్వీట్‌ చసస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు