‘పాల దంతాలు ఊడిపోయాయి సాయం చేయండి’.. ప్రధాని మోదీ, అస్సాం సీఎంకు అక్కాచెల్లెళ్ల లేఖ

29 Sep, 2021 11:45 IST|Sakshi

సాధారణంగా ఊరిలోని సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు లేఖలు రాయడం తెలిసిందే. ఆ మధ్య కాలంలో విచిత్రంగా కొంతమంది తమ ప్రేమ కోసం, కనిపించకుండా పోయి వాటిని వెతికి పెట్టాలంటూ వింత కారణాలతో అధికారులకు, ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు చిన్నారులు తమ పాల దంతాలు ఊడిపోతున్నాయని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. అస్సాంలోని గువాహటికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ పాల దంతాలు ఊడిపోవడం వల్ల ఇష్టమైన ఆహారాన్ని నమిలి తినడం కష్టంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు లేఖ రాశారు. 
చదవండి: ‘మై హీరో..’ చిన్నారి హార్ట్‌ టచింగ్‌ లేఖ

ఆరేళ్ల రాయిసా రౌజా అహ్మద్, ఐదేళ్ల ఆర్యన్ అహ్మద్ అనే ఇద్దరి చిన్నారులకు  దంతాలు పెరగకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో తమ సమస్యలను ఉన్నత అధికారులకు విన్నపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంకేంముంది అనుకుందే తడవుగా ఇద్దరు పిల్లలు తమ సమస్యను చెబుతూ నోట్‌బుక్‌లో రాశారు. ‘హిమంత బిశ్వ శర్మ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మా పాల ఊడిపోయాయి. మళ్లీ దంతాలు పెరగడం లేదు. దయచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అంటూ క్యూట్‌గా విన్నవించారు. దీనిని పిల్లల మామయ్య ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. 
చదవండి: Factcheck: బోస్‌ మరణవార్తని చదువుతున్న బోస్‌!!.. ఇదీ అసలు విషయం

‘నా మేనకోడలు రౌజీ, మేనల్లుడు ఆర్యన్ నన్ను నమ్మండి. నేను ఇంట్లో లేను. నేను డ్యూటీలో ఉన్నాను, నా మేనకోడలు, మేనల్లుడు సొంతంగా రాశారు. దయచేసి వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని నమలలేకపోతున్నందున.. వారి దంతాల కోసం అవసరమైన చర్యలు తీసుకోండి ’ అంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. సెప్టెంబర్‌ 25న షేర్‌ చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అరే ఇది నిజంగానే పెద్ద సమస్యే.. చిన్నారులు అడిగిన విధానం బాగుంది. వాళ్ల సమస్యకు పరిష్కారం చూపాల్సిందే’ అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు