ఫుడ్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. ఏటీఎంలో బిర్యానీ.. ఎక్కడుందో తెలుసా?

14 Mar, 2023 13:36 IST|Sakshi

ATM.. ఈ పేరు వినగానే ఎవరికైనా డబ్బులు డ్రా చేసుకునే మిషన్‌ గుర్తొస్తుంది. వివిధ బ్యాంక్‌ ఖాతాదారులు ఏటీఎం కార్డుల ద్వారా డబ్బులు విత్‌ డ్రా చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల బంగారం కొనుక్కోవడానికి ఏటీఎం వచ్చాయి. తాజాగా మరో కొత్త ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోనే మొట్టమొదటిసారి తమిళనాడులో బిర్యానీ ఏటీఎం తెరిచారు. దీని ద్వారా కేవలం నిమిషాల్లోనే వినియోగదారులు ఘుమఘుమలాడే బిర్యానీని పొందవచ్చు.

చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న ఐడీయాతో ముందుకొచ్చింది. నగరంలోని కొలత్తూర్‌లో బాయ్ వీటు కల్యాణం (బీవీకే) ఈ బిర్యానీ ఏటీఎంలను ప్రారంభించింది. ఇది ప్రీమియం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీని అందిస్తోంది. బిర్యానీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏర్పాటు చేసినట్లు దీని ప్రతినిధులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. అది వైరల్ అయింది. ఇందులో ఫుడ్‌ ఎలా డెలివరీ అవుతుందో చూపిస్తోంది.

ఈ బిర్యానీ ఏటీఎంలు ఎలా పనిచేస్తాయంటే..
సాధారణ ఏటీఎంల లోపల ఎలా ఉంటుందో ఈ బిర్యానీ ఏటీఎం కూడా అలాగే ఉంటుంది. ఈ ఔట్‌లెట్‌లో 32 అంగుళాలతో ఏర్పాటు చేసిన ఈ మెషిన్ లోని మెనూలో నుంచి కావాల్సిన బిర్యానీని టచ్ స్క్రీన్ పై ఎంచుకుని, పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. తరువాత బిర్యానీ ధరను డెయిట్‌/క్రెడిట్‌ కార్డులు లేదా యూపీఐ స్కానర్ ద్వారా చెల్లించాలి.

డబ్బు చెల్లించిన అనంతరం స్క్రీన్‌పై కౌంట్ డౌన్ టైమర్ ఆన్ అవుతుంది. వేడి వేడి బిర్యానీ ఇంకెంత సేపట్లో వస్తుందో ఈ టైమర్ ద్వారా తెలుసుకోవచ్చు. నిర్ణీత సమయం పూర్తవగానే ఏటీఎం మెషిన్‌కు ఉన్న చిన్న డోర్‌ను తెరవగానే అందులోని బిర్యానీ పార్శల్‌ను  తీసుకెళ్లిపోవడమే.  సరికొత్త ఆలోచనతో వచ్చిన ఈ బిర్యానీ ఏటీఎం కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బీవీకే  ఐడియా అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు.
చదవండి: ప్రాంక్‌ వీడియో.. తెలియక గర్ల్‌ఫ్రెండ్‌ ఎంత పని చేసిందంటే!

A post shared by FOOD VETTAI (@food_vettai)

మరిన్ని వార్తలు