రాహుల్‌ పాదయాత్రలో మెరిసిన హీరోయిన్‌.. ఫోటోలు, వీడియోలు వైరల్‌

17 Nov, 2022 18:27 IST|Sakshi

ముంబై: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర గురువారంతో 71వ రోజుకి చేరింది.  ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. రాహుల్‌ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు, నటీనటులు సైతం యాత్రలో పాల్లొంటున్నారు. 

జోడో యాత్ర అకోలా నగరంలో కొనసాగుతున్న సందర్భంగా బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రాహుల్‌ గాంధీతో జాయిన్‌ అయ్యారు.  రాహుల్‌తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచారు.రాహుల్‌, రియా సేన్‌ కలిసి నడుస్తున్న ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అటు రియా సైతం రాహుల్‌ని కలిసిన అనుభవాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. సినీ నటిగా మాత్రమే కాకుండా గర్వించదగిన పౌరుడిగా ఈ యాత్రలో భాగమైనందుకు సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు.

కాగా రియా.. ఝంకార్ బీట్స్, నౌకదుబి వంటి సినిమాలతో పాపులారిటీ సాధించారు.  ఇంతకుముందు నటి పూజాభట్‌ రాహుల్‌ గాంధీకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లో జోడో యాత్ర కొనసాగిన క్రమంలో రాహుల్‌తో కలిసి నడిచారు. ఇక సెప్టెంబర్‌ 7న బారత్‌ జోడో యాత్ర పేరుతో కన్యకుమారి నుంచి రాహుల్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్‌ 9న నందేడ్‌ జిల్లా ద్వారా మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

మరిన్ని వార్తలు