కారు బానెట్‌పై వధువు విహారం.. చివరిలో ట్విస్ట్‌ అదిరిపోయింది

14 Jul, 2021 13:11 IST|Sakshi

ప్రతి అమ్మాయి తన పెళ్లిని జీవితాంతం గుర్తిండిపోయేలా జరుపుకోవాలనుకుంటుంది. పెళ్లి జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందకు ఎన్నో కలలుకంటుంది. తనకు నచ్చినట్లు పక్కా ప్లాన్‌ ప్రకారం ముందుకెళ్తుంటుంది. అచ్చం ఇలాగే పుణెకు చెందిన యువతి తన వివాహంపై ఎక్కవగానే అంచనాలు పెట్టుకుంది. పెళ్లినాడు  వివాహం మండంపంలోకి వైభవంగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇంతలో పెళ్లిరోజు రానే వచ్చింది. దీంతో ఈ 23 ఏళ్ల వధువు మంగళవారం తన ఇంటి నుంచి కదిలే ఎస్‌యూవీ కారు బానెట్‌పై కూర్చొని పెళ్లి మండపం వద్దకు వెళ్లింది. ఈ దృశ్యాలను బైక్‌ మీద ఉన్న వీడియో గ్రాఫర్‌ తన కెమెరాలో చిత్రీకరించాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. తరువాత ఆమెను చిక్కుల్లోకి పడేసింది.

అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో మోటార్‌ వాహన చట్టాన్ని ఉల్లంఘించినందుకు యువతిపై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు, వీడియోగ్రాఫర్‌, కార్‌ డ్రైవర్‌తోపాటు యువతి కుటుంబ సభ్యులపై మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక వధువుతో సహా పెళ్లి మండపం వద్ద ఎవరూ మాస్క్‌ పెట్టుకోకపోడంతో కోవిడ్ నిబంధనలు కూడా అతిక్రమించారని పోలీసులు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు