ఈ ఫోటోలో మరో చిరుత కూడా ఉందండోయ్‌.. గుర్తుపట్టారా?

26 Jun, 2021 15:24 IST|Sakshi

శక్తికి మారుపేరైన చిరుతపులి దాడి చేస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిందే. వెంటాడి, వేటాడి ఎలాంటి జంతువునైనా నిమిషాల్లో తనకు ఆహారం చేసుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుతపులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలో ఇది ఆరితేరిన జంతువు. అలాంటి చిరుతకు సంబంధించిన ఓ ఫోటోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి పర్వీన్‌ కశ్వన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ చిత్రంలో ఎన్ని చిరుతలు ఉన్నాయో గుర్తించాలంటూ నెటిజన్లకు సవాల్‌ విసిరాడు. అయితే ముందుగా దీన్ని ఫోటోగ్రాఫర్‌ మోహన్‌ థామస్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫోటోను మళ్లీ రీ ట్వీట్‌ చేశాడు. 

ఓ ఫోటోలో చిరుత చెట్టుపై ఎక్కి ఎంచక్కా కూర్చుంది. అయితే ఇందులో చిరుత ఒక్కటే లేదు. మరో చిరుత పిల్ల కూడా దాగి ఉంది. ఫోటోలో దానిని గుర్తు పట్టుకోవాలి. సాధారణంగా కొన్ని చూడగానే టక్కున కనిపిస్తాయి. మరికొన్ని ఏకాగ్రతను కూడగట్టుకొని నిశితంగా పరిశీలిస్తేనే అవి కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫోటోలో బుల్లి చిరుత ఎక్కడుందో కనిపెట్టండి.

కావాలంటే మీకు ఓ క్లూ కూడా ఇస్తాము. కింద ఉన్న ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే రెండు తోకలు కనిపిస్తాయి. ఇప్పుడు చెట్టు మధ్యలో పరిశీలిస్తే మీరు కొంచెం సులభంగా గుర్తించవచ్చు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ తోక కనిపించడం వల్ల పిల్ల చిరుతను గుర్తించడం సులభంగా మారిందని, అదే తోక లేకుండా ఉంటే చాలా కష్టమయ్యేదని కామెంట్‌ చేస్తున్నారు. దీనిపై మరి మీరూ ఓ పట్టు పట్టండి.

చదవండి: Cheetahs: చీతా గురించి మీకు ఈ విషయాలు తెలుసా!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు