నేహాను చీరలో చూడాలి.. ఫేర్‌వెల్‌ చేసుకోనివ్వండి.. ప్రధానికి విద్యార్థి ట్వీట్‌

2 Jun, 2021 17:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా అన్ని రకాల పరీక్షలు వాయిదా, రద్దు అవుతున్నాయి. ఈ ఏడాది సెకండ్‌ వేవ్‌తో అనూహ్యంగా కరోనా కేసులు పెరగడం, ప్రాణనష్టం ఉండడంతో సీబీఎస్‌ఈ బోర్డు పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని, దీనిపై రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులు రిస్క్‌లో పడేందుకు ఈ పరీక్షలు కారణం కాకూడదని సూచించారు.

పరీక్షలు రద్దవడంతో విద్యార్థులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ప్రధాని నిర్ణయంతో ఏకీభవించని ఓ విద్యార్థికి వింత కోరిక కలిగింది. 12వ తరగతి ముగించుకుని స్కూల్ నుంచి బయటకు వెళ్లే తమకు ఫేర్ వెల్ పార్టీ లేదని బాధతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కే ట్వీట్ చేశాడు. ‘"సర్ ఫేర్‌వెల్‌ పార్టీ అయినా చేసుకోనివ్వండి. 12వ తరగతి బి సెక్షన్ నేహాను నేను చీరలో చూడాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరలవుతోంది. దీనిపై స్పందించిన అనేకమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు 

మరిన్ని వార్తలు