హోటల్‌లో షాకిచ్చిన వెయిటర్‌.. కస్టమర్‌ కూల్‌గా ఏం చేశాడంటే!

22 Mar, 2023 14:31 IST|Sakshi

దక్షిణాదిలో ప్రజలు తమ టిఫిన్‌ సెక్షన్‌లో ఎక్కువగా తినే వంటకాల జాబితాలలో మసాల దోస ఖచ్చితంగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే దోసలందు మసాల దోస టేస్ట్‌ వేరయా అన్నట్లు ..దాని తిని ఆశ్వాదించాల్సిందే తప్ప మాటలతో చెప్పలేము. అంతటి ప్రాముఖ్యమున్న వంటకానికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఓ వ్యక్తికి ఆకలి వేసి ముంబైలోని కృష్ణ ఛాయా హోటల్‌కు వెళ్లాడు. తనకు ఇష్టమైన మసాల దోస ఆర్డర్‌ చేశాడు. కాసేపటి తర్వాత వెయిటర్‌ తన ఆర్డర్‌ను తీసుకువచ్చి ఇచ్చాడు. అయితే అది చూసి సదరు వ్యక్తి షాక్‌ అయ్యాడు. ఎందుకంటే.. తాను ఆర్డర్‌ చేసిన మసాలా దోశను.. మసాలా విడిగా, దోశను విడిగా సర్వ్‌ చేశాడు ఆ వెయిటర్‌. ఆకలి మీద ఉన్న ఆ వ్యక్తి సాంబర్‌, చట్నీతో దోశ తిని సరిపెట్టుకున్నాడు. మరి మిగిలిన మసాలాను ఏం చేశాడన్న విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.

తన ట్వీట్‌లో..  "నేను ఒక ఫుడ్ బ్లాగర్‌ని. నిన్న కృష్ణ ఛాయా దగ్గర మసాలా దోసె ఆర్డర్ చేసాను. లోపల ఏం జరిగిందో తెలియదు గానీ వాళ్ళు మసాల దోసకు బదులుగా.. దోస విడిగా, మసాలా విడివిడిగా సర్వ్‌ చేశారు. నేను దోసె తిన్నాను. విడిగా ఇచ్చిన మసాలాను ఇంటికి తీసుకెళ్లి ఫ్రిజ్‌లో ఉంచాను. ఆ తర్వాత రోజు దాచిన మసాలతో నా ఇంట్లో మసాల దోశ చేసుకుని తిన్నాను. టెస్ట్‌ ఓహోహో!" అని మసాల దోశ ఫోటోని షేర్‌ చేశాడు. ఆ ‍వ్యక్తి పోస్ట్‌ ప్ర‍స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అతని క్రియేటివికి ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు