వైరల్: అంగవైకల్యం ఉన్నా.. స్టెప్పులు ఇరగదీసిన యువతి

16 Jun, 2021 20:39 IST|Sakshi

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ ఓ యువతి డాన్స్‌ని ఇరగదీసింది. ఆ యువతి తనకున్న ఒక్క కాలుతో అద్భుతంగా డాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తూ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వికలాంగ డాన్స్‌ర్‌ సుభ్రీత్ కౌర్ ఘుమ్మన్ అగ్నిపత్‌లోని హిట్‌ సాంగ్‌ 'చికినీ చమేలీ' డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఆమె చేసిన డాన్స్‌కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సుభ్రీత్ మొదటి సారి.. ఇండియాస్‌ గాట్‌ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆమె ఈ షోలో రెండో రౌండ్‌కు అర్హత కూడా సాధించింది. ఇటీవల సుభ్రీత్ అప్పట్లో తాను డాన్స్‌ చేసిన పాటకు మళ్లీ అదే ఎనర్జీతో స్టెప్పులేసిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌లో... " నా మొదటి టీవీ నృత్య ప్రదర్శనను 7 సంవత్సరాల తరువాత మళ్లీ చేస్తున్నాను ... మీకు ఇది నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను" అనే క్యాప్షన్‌తోటి ఈ వీడియోను అప్‌లోడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూ ఇప్పటికే 28 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టింది. నెటిజన్లు ఆమె డాన్స్‌కు , ఆత్మధైర్యానికి ఫిదా అవుతున్నారు.

A post shared by subhreet Kaur Ghumman (@subhreet.ghumman)

మరిన్ని వార్తలు