Niramala Sitaraman: అయ్యగారికి దండం పెట్టు.. క్యూఆర్‌ కోడ్‌కి డబ్బులు కొట్టు...

5 Nov, 2021 13:43 IST|Sakshi

ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్‌ చెల్లింపులు అయిపోయాయి. ఇక భారత్‌లో డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిచోటా నగదుకు బదులు ఫోన్‌లోని యాప్స్‌ ద్వారానే పే చేసేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి టీ కొట్టు నుంచి షాపింగ్‌ మాల్‌ వరకు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్స్‌కే మొగ్గు చూపుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు. ఇది దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ ఎలా మార్పు తీసుకొచ్చిందనే దానికి అద్దం పడుతోంది.
చదవండి: కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్‌ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. ఓ ఇంటి ముందుకు వచ్చిన గందిరెద్దుపై క్యూఆర్‌ కోడ్‌ ట్యగా్‌ ఉంటుంది. ఆ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు చేస్తాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ..‘గంగరెద్దలాటకు చెందిన వీడియో ఇది. డిజిటల్ చెల్లింపు విప్లవం జానపద కళాకారులకు చేరువైంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో గంగిరెద్దులవాళ్లు సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఎద్దులకు పలమాలలు వేసి ఇంటింటికి వెళ్లి నాదస్వారం వాయిస్తూ భిక్ష తీసుకుంటారు.’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు