వార్నీ, వధువును పక్కన పెట్టుకుని నిద్రపోయిన పెళ్లికొడుకు: వైరల్‌

16 Jul, 2021 21:19 IST|Sakshi

కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు వివాహాలు వాయిదా పడ్డాయి. ఇక వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మొదలైంది. ఇటీవల ఉత్తరాన జరుగుతున్న వివాహ వేడుకలు ఏదో ఓ సంఘటన మూలాన అవి వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ జాబితాలో.. ఓ వధువు స్వీటు తినిపిస్తుంటే వరుడు తినకపోవడంతో ఆమె కోపంతో విసిరి కొట్టగా, మరో ఘటనలో వరుడు గుట్కా నమిలాడని వధువు వివాహాన్నే వద్దనేసింది. ఇక తాజాగా ఓ వరుడు తన పెళ్లి రిసెప్షన్‌లో ఏకంగా నిద్రపోతూ కెమెరాకు కనిపించి అడ్డంగా బుక్కయ్యాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. భార‌తీయల వివాహాలంటే ఎన్నో సంప్రదాయాలు, కార్యక్రమాలు, వేడుక‌లంటూ అబ్బో.. చెప్పాలంటే ఓ పెద్ద జాబితానే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో పెళ్లిళ్ల కార్యక్రమాలు వింతగా కూడా ఉంటాయ్‌. పెళ్లికి ముందు జరిగే వేడుక‌ల్లోనూ వ‌ధూవ‌రులు పాలుపంచుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియలో ఆ కొత్త జంట అలిసిపోతుంటారు. అలా అల‌స‌ట తీర‌లేదేమో.. ఓ వరుడు అతని వివాహ వేడుక‌లోనే రిసెప్షన్‌ సాగుతుండ‌గానే నిద్రలోకి జారుకున్నాడు. దీన్ని గమనించిన బంధువులు త‌ట్టిలేపినా ఆ పెళ్లి కొడుకు లేవక అలానే గుర్రుగా నిద్ర‌పోతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో కామెంట్లు కురిపిస్తున్నారు. 

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు