3 రోజులు అక్కడ.. 3 రోజులు ఇక్కడ.. ఒక భర్త, ఇద్దరు భార్యల మధ్య ఒప్పందం!

15 Mar, 2023 11:45 IST|Sakshi

ఒక్కోసారి కోర్టులో తీరని సమస్యలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే తీరుతాయంటారు. అదే చేశారు ఓ భర్త ఇద్దరు భార్యలు. అసలు విషయం ఏంటంటే.. ఓ వ్యక్తి తన ఇద్దరి భార్యలతో సమస్య రాగా కోర్టుకు వెళ్లారు. చివరికి కూర్చుని మాట్లాడుకుని ఓ ఒప్పందం చేసుకుని సమస్యను పరిష్కరించుకున్నారు. 

భర్తకు దూరంగా.. అసలు విషయం తెలిసి షాక్‌
హర్యానాలోని గురుగ్రామ్‌లో పనిచేస్తున్న ఒక ఇంజనీర్ 2018లో 28 ఏళ్ల సీమాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి సంసారం కరోనా రాకతో చెక్‌ పడింది. లాక్‌డౌన్‌ కారణంగా సీమ భర్త కుటుంబానికి దూరంగా తాను పని చేస్తున్న చోటు ఉండాల్సి వచ్చింది.  ఈ క్రమంలో తన సహోద్యోగులలో ఒకరితో అతనికి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో చివరికి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇదిలా ఉండగా తన భర్తలో మార్పు రావడం, తనకి దూరంగా ఉండడాన్ని గమనించిన సీమకు భర్తపై అనుమానం వచ్చింది. అసలువిషయం తెలుసుకునేందకు సీమ గురుగ్రామ్‌కు పయనం కాగా అక్కడ తన భర్త మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిసి ఆగ్రహానికి గురైంది.

వారాన్ని ఇలా పంచుకున్నారు
సీమ తన భర్త పెళ్లి చేసుకున్న యువతితో గొడవపడింది. ఫలితం లేకపోయే సరికి తన కుమారుడి పోషణకు తగిన భరణం డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. అనంతరం కోర్టు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించింది. చివరికి వారి ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరి ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం.. ఆ వ్యక్తి ఒక వారాన్ని ఇద్దరు భార్యలతో షేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారంలో ఒక భార్యతో మూడు రోజులు, మరో భార్యతో మరో మూడు రోజలు గడపాల్సి ఉంటుంది. మిగిలిన ఒక్క రోజు తనకు నచ్చిన చోటు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఆ ఇద్దరి మహిళలకు రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లు ఉంచి సంసారం సాగిస్తున్నాడు.

చదవండి: లగేజీ రుసుము వివాదం.. వదిలేసి విమానం ఎ‍క్కిన విద్యార్థి.. ట్విస్ట్‌ ఏంటంటే!

 

మరిన్ని వార్తలు