వర్క్‌ ఫ్రం హోమ్‌: నా జీన్స్‌, షూ ఎక్కడున్నాయో తెలీదు

20 May, 2021 20:28 IST|Sakshi

కోవిడ్‌ మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి అన్ని సంస్థలు తమ ఉద్యోగస్థులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ సదుపాయాన్ని కల్పించింది. ప్రస్తుతం కోవిడ్‌ కట్టడికి, సామాజిక దూరానికి వర్క్‌ ఫ్రం హోమ్‌ కామన్‌ అంశంగా మారిపోయింది. అంతేగాక ఉద్యోగులంతా జూమ్ కాల్స్, మీటింగ్స్‌.. ఇలా అన్ని ఇంటి నుంచే కానిచ్చేస్తున్నారు. తాజాగా  పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఓ ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. ఎంప్లాయిస్‌ తిరిగి కార్యాలయానికి వెళ్లడానికి ఎందుకు ఇష్టపడటం లేదో కొన్ని కారణాలను వెల్లడించారు.

హర్ష గోయెంకా ప్రస్తుత ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను, ఇతరులకు స్ఫూర్తినిచ్చే సందేశాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా  ‘ప్రజలు కార్యాలయానికి ఎందుకు వెళ్లకూడదని నేను అడిగాను’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ పోస్టులో ఉద్యోగులు అందించిన ఫన్నీ రిప్లైలను చార్ట్‌ రూపంలో చూపించారు. ‘నేను పూర్తి ప్యాంటు ధరించాలి’. ‘ట్రాఫిక్‌లో సమయాన్ని ఎందుకు వృధా చేస్తాను’. నా కుటుంబం చుట్టూ ఉండటం నాకు ఇష్టం. ‘నేను ఇంట్లో ఎక్కువ పనిని కలిగి ఉన్నాను’. ‘నా సహోద్యోగులను కలవకపోవడం నాకు సంతోషంగా ఉంది’. వంటి సరదా సమాధానాలను వెల్లడించారు.

అయితే ఇందులో ఎక్కువగా ‘నేను పూర్తి ప్యాంటు ధరించాల్సి ఉంటుంది’ అనే కారణమే చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరలవుతోంది. అనేకమంది లైక్‌లు, రీట్వీట్లు చేస్తున్నారు. హర్ష్‌ ట్వీట్‌పై మరికొంత మంది స్పందిస్తూ.. ‘నా షూస్‌, జీన్స్‌ ఎక్కడ ఉన్నాయో తెలీదు. నా బట్టలు ఇప్పుడు నాకు సెట్‌ అవుతాయన్న నమ్మకం లేదు’ అంటూ జోకులు పేలుస్తున్నారు.

చదవండి: గూగుల్‌ గుడ్‌ న్యూస్‌: వారానికి 3 రోజులే ఆఫీస్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు