Viral Video: ఓరిని తెలివి.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా.. అయినా దొరికిపాయే!

6 Apr, 2022 16:59 IST|Sakshi

చండీగఢ్‌: కొందరు విద్యార్థులు చదవడంలో చూపించని శ్రద్ధ.. పరీక్షలో కాపీ కొట్టే సమయంలో బాగా ప్రదర్శిస్తారు. చీటింగ్‌ చేసేందుకు ఉన్న అన్ని రకాల పద్దతులను ప్రయత్నిస్తుంటారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీని సైతం కాపీ కొట్టడంలో తెగ వాడేస్తుంటారు. చిట్టిలు పట్టుకెళ్తే దొరికిపోతామని భావించి.. స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌, మొబైల్స్‌ ద్వారా కూడా మాస్‌ కాపింగ్‌కు పాల్పడే అపర మేధావులున్నారు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి హై లెవల్లో కాపింగ్‌కు పాల్పడి అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు.. 

హార్యానాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫతేహాబాద్‌లో ఓ విద్యార్థి చీటింగ్‌ పాల్పడ్డాడు. ఇంగ్లీష్‌ పరీక్ష రోజున గ్లాస్‌ క్లిప్‌బోర్డును ఉపయోగించాడు. అందులో రహస్యంగా అమర్చిన మొబైలోని కొన్ని యాప్స్‌, వాట్సాప్‌ ఉంది. వీటిలో సబ్జెక్టుకు సంబంధించిన కంటెంట్‌ను భద్రపరుచుకున్నాడు. దీని ద్వారా పరీక్షల్లో చూసి రాస్తున్నాడు. అయితే పాపం విద్యార్థి తెలివి తేటలు అధికారులకు తెలిసిపోయాయి. గమనించిన  ఫ్లయింగ్‌ స్క్వాడ్ అధికారి విద్యార్థిని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని జర్నలిస్ట్‌ దీపేందర్‌ దేశ్వాల్‌ షేర్‌ చేశారు.  ‘బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న పరీక్షలో ఫతేబాద్ హార్యానాలోని జిల్లాలో ఒక పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థి  క్లిప్‌బోర్డ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను అమర్చి కాపియింగ్‌ పాల్పడ్డాడు. దీనిని ఫ్లయింగ్ స్క్వాడ్ గుర్తించారు’. అని పేర్కొన్నారు. కాగా ఇంగ్లీష్‌ పరీక్ష రోజు సుమారు 457 మంది విద్యార్థులు మోసాలకు పాల్పడ్డారు. భువా పరీక్షా కేంద్రంలో పదో తరగతి విద్యార్థి కార్పెట్‌ కింద దాచిన మొబైల్‌ ఫోన్‌ను స్కాడ్‌ సిబ్బంది గుర్తించారు. అలాగే బిర్దానా పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి ప్యాంట్‌లో, మరో విద్యార్థిని షర్ట్‌లో ఉన్న చీటీలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు