అమ్మో ఎంత పెద్ద షార్కో..

26 Feb, 2021 12:22 IST|Sakshi

భువనేశ్వర్‌: సముద్రంలో ఉన్న షార్క్‌లను చూడటానికి ప్రతి ఒక్కరు తెగ ఆసక్తికనబరుస్తారు.. దీనికోసం సముద్రంలోనికి వెళ్ళడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ షార్క్‌ మీకేందుకు శ్రమ ఇవ్వాలనుకుందో ఏమో తనే సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకుని వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌లోని సునాపుర్‌ బీచ్‌ వద్ద 20 ఫీట్ల పొడవైన షార్క్‌ తీరానికి కొట్టుకుని వచ్చింది. ఇది మాములు షార్క్‌లకన్నా చాలా పెద్దది. మొదట మత్య్సకారులు చనిపోయి వచ్చిందేమోనని భావించారు. తీరా దగ్గరికి వెళ్ళిచూసేసరికి అది ప్రాణాలతోనే ఉంది. ఈ భారీ షార్క్‌ను చూడటానికి  స్థానికులు, పర్యాటకులు పెద్దఎత్తున ఎగబడ్డారు.

వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో  అక్కడికి  చేరుకున్న అటవీశాఖ అధికారులు షార్క్‌ బతికే ఉందని నిర్థారించుకుని, స్థానికుల సహకారంతో తిరిగి సముద్రంలోనికి వదిలివేశారు.  అయితే, గతంలోను బాలసోర్‌, సునాపుర్‌ బీచ్‌ల వద్ద చనిపోయిన షార్క్‌లు తీరానికి కొట్టుకుని వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తిమింగలాలను వైల్డ్‌లైఫ్‌ ప్రొటేక్షన్‌యాక్ట్‌ కింద అంతరించిపోతున్న జీవజాతుల జాబితా కింద సంరక్షిస్తున్నారు. 

చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు!

మరిన్ని వార్తలు