ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’

24 Aug, 2022 14:25 IST|Sakshi

ఎందుకు.. ఆశ్చర్యం అని చెప్పుకునేలోపు.. మనమో చిన్న కథ చెప్పుకుందాం.. 

అనగనగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరికి చెరో నలుగురు పిల్లలు. ఓరోజు అక్క భర్తకు ఎందుకో కోపమొచ్చింది.. అక్కను చంపేశాడు.. అలాగే ఓ బిడ్డనూ చంపేశాడు. అక్క పిల్లలు అనాథలయ్యారు.. చెల్లెలే ధైర్యంగా నిలబడింది.. వారిని చేరదీసింది. వారి కన్నీళ్లను తుడిచింది. ఎలా మెలగాలో చెప్పింది.. ఎలా బతకాలో నేర్పింది. బతుకుదెరువు చూపింది. ప్రయోజకుల్ని చేసింది.. 

ఏంటీ.. పాతకాలపు సెంటిమెంటు స్టోరీ అనేగా మీ డౌటు..ఈ స్టోరీ మనుషులది కాదు.. ఈ పులులది అని చెబితే.. ఆశ్చర్యమే కదా..ఎందుకంటే.. ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు అని ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నందా అన్నారు. అవి ఆహారాన్ని ఆరగిస్తున్న చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఆయన.. ఈ ఫొటో వెనకున్న కథను నెటిజన్లకు తెలిపారు.   

మరిన్ని వార్తలు