వైరల్‌: కరోనా ఇతని దరిదాపుల్లోకి కూడా చేరదు..

11 Jun, 2021 17:31 IST|Sakshi

మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభ్రతపై ఎక్కువ దృష్టి సారస్తున్నారు. మాస్క్‌ ధరించడం, చేతుల్ని పదే పదే కడుక్కోవడం, శానిటైజర్, హ్యాండ్ వాష్‌ను ఉపయోగించడం ఎక్కువైపోయింది. ఇంట్లో నుంచి బయటకు ఎక్కడకు వెళ్లినా.. మాస్క్‌తోపాటు శానిటైజర్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అన్ని దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, షాపింగ్ మాల్స్‌.. ఇలా ప్రతి చోటా హ్యాండ్ శానిటైజర్‌ను కచ్చితంగా అందిస్తున్నారు. సాధారణంగా శానిటైజర్‌ కొన్ని చుక్కలు తీసుకొని మోచేతుల వరకు క్లీన్ చేసకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒంటికి నూనె అద్దినట్లు హ్యాండ్ శానిటైజర్ రాసుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియోను రూపిన్‌ శర్మ అనే ఐపీఎస్‌ అధికారి తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇందులో ఓ వృద్ధుడు మరికొంతమందితో కలిసి ఓచోట కూర్చొని ఉన్నాడు.. ఇంతలో టో వ్యక్తి శానిటైజర్ నుంచి ముసలాయనకు రెండు మూడు చుక్కలను వేయగా.. చేతులతో పాటు, జుట్టు, ముఖం, కాళ్లకు కూడా రాసుకున్నాడు. రెండో సారి కూడా శానిటైజర్ వేయగా.. మళ్లీ అదే రీతిలో శరీరానికి పట్టించాడు. ‘కరోనా అతడిని తాకే ధైర్యం ఏమాత్రం చేయదు. కానీ అంకుల్ మీరు మాస్క్‌ను కిందకు లాగాల్సిన అవసరం లేదు.’ అని క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

50 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోపై నెజిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. "అంకుల్ శానిటైజర్ ఉపయోగించి మీరు స్నానం చేస్తే బాగుండేది" అని ఒకరు కామెంట్ పెట్టగా.. "మీకు సంపూర్ణమైన రక్షణ కవచంలా శానిటైజర్ పనిచేస్తోంది" అని మరొకరు పోస్ట్ చేశారు. "కరోనా అతడి దగ్గరకు వెళ్లడానికి కూడా ధైర్యం చేయదు" అని ఇంకొకరు స్పందించారు. మరికొంత మంది అతని అమాయకత్వం చూసి నవ్వుకుంటున్నారు. ఇతడికి జాగ్రత్తగా ఎక్కువని ట్వీట్ చేయగా.. "పాపం ఇతడికి శానిటైజర్ ఎలా వాడాలో తెలియదనుకుంటా" అని పోస్ట్ చేశారు.

చదవండి: విషాదం: పొగిడారు, ఫొటోలు తీశారే తప్ప..
జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి...

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు