Pastry Maggi Video: ఈ ప్రపంచానికి ఏమైంది? నిన్నటికి నిన్న మ్యాంగో మ్యాగీ.. నేడు పేస్ట్రీ మ్యాగీ! 

18 May, 2022 00:18 IST|Sakshi

నిన్నటికి నిన్న ‘మ్యాంగో మ్యాగీ’అనే వెరైటీ వంటకమొకటి ఇంటర్నెట్‌లో వైరలైందో లేదో ఇంతలోనే ఇంకో రకమైన మ్యాగీ వంటకం పుట్టుకొచ్చింది. చాక్లెట్‌ పేస్ట్రీ (కేక్‌ లాంటిది)తో కలిపి చేసిన ఈ వంటకం వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఫ్రై చేసే పెనంపై కొంచెం నూనె పోసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశారు.

అలా ఫ్రై చేస్తుండగానే ఓ చాక్లెట్‌ పేస్ట్రీని అందులో వేసి నీళ్లు పోశారు. ఇదంతా బాగా ఉడికిన తర్వాత మ్యాగీని కలిపి పైన మసాలా పోశారు. ఇంకేముంది.. కాసేపయ్యాక పేస్ట్రీ మ్యాగీ రెడీ. ఈ వంటకం వీడియో చూసిన నెటిజన్లు ‘ఏమైంది ఈ ప్రపంచానికి?’అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 
చదవండి: మ్యాంగో మ్యాగీ.. ‘దేవుడా! నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’

మరిన్ని వార్తలు