Optical Illusion: ఈ కాఫీగింజల్లో ఉన్న వ్యక్తి ముఖాన్ని గుర్తించగలరా?

24 May, 2022 17:10 IST|Sakshi

సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక ప్రతి చిన్న విషయం ప్రజలకు తొందరగా చేరుతుంది. సోషల్‌ మీడియాలో వినోదభరిత వీడియోలే కాదు మెదడుకు మేతపెట్టే విషయాలు కూడా ఉంటాయి. మనకు తెలియని ఎన్నో నిజాలను, విశేషాలను నేర్చుకోవచ్చు.  ఈ రకమైన దానినే ఆప్టికల్‌ ఇల్యూజన్‌ అంటారు. గందరగోళ రూపంలో ఉన్న  ఫోటోలు, పెయింటింగ్స్‌లో నుంచి సమాధానాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. ఏకాగ్రతను పెంచి మెదడు చురుకుగా పనిచేయించడమే దీని వెనకున్న ఉద్ధేశ్యం. 

తాజాగా అలాంటి ఫోటోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఒక ఫోటోలో పెద్ద సంఖ్యలో కాఫీ గింజలు ఉన్నాయి. అయితే అందులో ఓ మనిషి బొమ్మ కూడా దాగి ఉంది. దాన్ని కనుగొనాలాంటూ సవాల్‌ విసిరారు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మనిషి ముఖాన్ని గుర్తించొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. కనిపెట్టడం కష్టంగా ఉంటే ఇక ఈ కింది చిత్రాన్ని చూడండి.

అయితే మీరు ఫోటో, పెయింటింగ్‌ చూసే విధానం ద్వారా మీ మెదడు ,వ్యక్తిత్వం ముఖ్య లక్షణాలు తెలుస్తాయి. మూడు సెకన్లలోపు మనిషి ముఖాన్ని గుర్తించగలిగితే, మీ కుడి మెదడు మీ తోటివారి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడు సెకన్ల నుంచి ఒక నిమిషం పడితే, మీ మెదడు కుడి సగం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. లేదా ఒకటి నుంచి మూడు నిమిషాల సమయం పట్టినట్లయితే, మీ మెదడు కుడి వైపు సమాచారాన్ని నెమ్మదిగా విశ్లేషిస్తుంది. ఒకవేళ మీకు మూడు నిమిషాలు సరిపోకపోతే, అలాంటి బ్రెయిన్ టీజర్ మీ మెదడుకు సవాలు విసురుతూనే ఉంటుందని ది మైండ్స్ జర్నల్ చెబుతోంది. 
చదవండి: విచిత్రమైన కేసు: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష!

మరిన్ని వార్తలు