అమెజాన్‌ పార్సిల్‌ అనుకుంటున్నారా‌.. కాదండోయ్‌!

24 Feb, 2021 15:38 IST|Sakshi

పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్‌ వేడుకలు... ఇలా శుభకార్యం ఏదైనా కేక్‌ ఉండాల్సిందే. కేక్‌ కటింగ్‌​ చేస్తేనే స్పెషల్‌ డేగా ఫీల్‌ అవుతాం. మరి కేక్‌కు ఇంతలా డిమాండ్‌ పెరుగుతండటంతో తయారీదారులు(బేకర్స్‌) కూడా విభిన్న రూపాల్లో డిజైన్‌ చేస్తున్నారు. మనకు నచ్చే విధంగా కొత్త కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు. ఇటీవలే హాస్పిటల్‌ బెడ్‌పై నవ్వుతున్న ఓ పేషెంట్‌లా తయారు చేసిన కేకు ఒకటి ట్రెండ్‌‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వినూత్న కేక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది సాధారణమైన కేక్‌ కాదండోయ్‌.. అమెజాన్‌ పార్సిల్‌ రూపంలో ఉన్న కేక్.

అవును మీరు విన్నది నిజమే. అచ్చం అమెజాన్‌ నుంచి వచ్చే ప్యాకేజ్‌ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేక్‌ను డిజైన్‌ చేశారు. అయితే దీనిని ఓ కేకు తయారీ సంస్థ డిజైన్‌ చేసింది. యాజమాని కొడుకు పుట్టినరోజు కోసం ఈ కేక్‌ తయారు చేశారు. ఇక దీనిని ట్వీటర్‌లో పోస్టు చేయడంతో అమెజాన్‌ పార్సిల్‌ కేక్‌ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీన్నిచూసిన నెటిజన్లు నిజంగానే అమెజాన్‌ పార్సిల్‌ అనుకుంటున్నారు. కానీ అది కేక్‌ అని చెప్పడంతో సందేహించి మరింత పరీక్షించి చూస్తున్నారు. ఈ తర్వాత కేక్‌ అని క్లారిటీ రావడంతో సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. అంతేగాక అనేకమంది నెటిజన్లు ఈ కేక్‌పై మీమ్స్‌ సృష్టిస్తున్నారు. మరి ఇతంలా వైరలవుతున్న దాని‌పై మీరు కూడా ఓ లుక్కేయండి 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు