వైరల్‌: గడ్డం గీయించుకోవాలని ప్రధాని మోదీకి రూ. 100 పంపాడు

9 Jun, 2021 19:41 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఎంతో మంది జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చొని హాయిగా తింటూ కాలాన్ని గడిపేవారు కొందరైతే.. తినడానికి తిండి కూడా దొరక్క అల్లాడిపోతున్నవారు కోకొల్లలు. పేదవాడి పూట గడవడమే కష్టతరంగా మారింది. లాక్‌డౌన్‌ కష్టాలను ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియజేయాలని ఆలోచించాడు. లాక్‌డౌన్‌తో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

మహారాష్ట్రలోని బారామతికి  చెందిన అనిల్‌ మోరే అనే వ్యక్తి ప్రైవేట్‌ ఆసుపత్రి ఎదురుగా టీ కొట్టు నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌పై తన అసంతృప్తిని ప్రధానికి  తెలియజేయాలని ఓ లేఖ రాశారు. అందులో  గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోదీకి రూ.100 పంపించాడు.‘ప్రధాని మోదీ గడ్డం బాగా పెంచుతున్నారు.. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి.. దేశంలో వీలైనంత వేగంగా వ్యాక్సిన్‌ వేయించడానికై ఉంటే మంచిది.. వైద్య సదుపాయాలను పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్, సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్లతో కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై దృష్టి పెట్టాలి’ అని లేఖలో పేర్కొన్నాడు మోరే.

అయితే దేశంలో ప్రధానమంత్రి స్థానం ఎంతో అత్యున్నతమైనదని, ప్రధాని మోదీ అంటే తన ఎంతో గౌరవం, అభిమానం అని చెప్పుకొచ్చాడు. తనును దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు వంద రూపాయలు పంపుతున్నట్లు తెలిపాడు.. దానితో ఆయన గడ్డం గీయించుకోవాలి అని పేర్కొన్నాడు. అయితే. ప్రధానిని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేసేందుకే ఇలా చేసినట్టు తెలిపారు.అంతేగాక కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ .5 లక్షలు, లాక్దె‌డౌన్‌తో దెబ్బతిన్న కుటుంబాలకు రూ .30000 ఆర్థిక సహాయం అందించాలని పీఎంకు రాసిన లేఖలో మోర్ కోరాడు. ఈ విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్‌వెల్‌ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్‌
జూన్ 23లోగా జీవో అమల్లోకి తీసుకురావాలి: హైకోర్టు 

                       

మరిన్ని వార్తలు