Dancing Dadi: హుషారైన స్టెప్పులతో శ్రీదేవిని దించేసిన బామ్మ.. వీడియో వైరల్‌

29 Oct, 2021 13:11 IST|Sakshi

తమ డ్యాన్స్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవుతున్న వారిని చాలానే చూశాం. ఏ కార్యక్రమం అయిన తమ డ్యాన్స్‌తోనే జనాలను అట్రాక్ట్‌ చేస్తున్నారు. చిన్నారులు, యువతతోపాటు ఈ మధ్యకాలంలో వయసు మళ్లిన బామ్మలు కూడా డ్యాన్స్‌ చేస్తూ ఏజ్‌ ఇజ్‌ జస్ట్‌ ఏ నంబర్‌ అంటూ నిరూపిస్తున్నారు. వీరిలో ఒకరు డ్యాన్సింగ్‌ దాదిగా పేరొందిన రవి బాల శర్మ. 63 ఏళ్ల యవసులోనూ తనదైన స్టైల్లో డ్యాన్స్‌ చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.
చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?

డాన్సింగ్‌ దాది మరోసారి తన డ్యాన్స్‌ వీడియోతో నెటిజన్లను అలరించారు. 2012లో వచ్చిన శ్రీదేవి ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ సినిమాలోని నవ్రాయ్ మాఝీకి పాటకు ఎంతో ఉల్లాసంగా డ్యాన్స్‌ చేశారు.  చీర కట్టులో అందంగా ముస్తాబై పర్‌ఫెక్ట్‌ స్పెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో చించేసింది. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో  శ్రీదేవి లోటును తీర్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రవి బాల శర్మ డ్యాన్స్‌ మూమెంట్స్‌కి ఎప్పటిలాగే నెటిజన్‌లు ఫిదా అవుతున్నారు. ‘సూపర్‌ స్టెప్పులతో శ్రీదేవిని దించేసింది. అద్భుతమైన డ్యాన్స్‌.. అంటూ పొగిడేస్తున్నారు.
చదవండి: లాహోర్‌ రోడ్లపై పరుగెత్తిన నిప్పుకోడి.. వీడియో వైరల్‌

A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma)

మరిన్ని వార్తలు