ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన మొబైల్‌ మ్యారేజ్‌ హాల్‌.. చూస్తే ‘వావ్‌’ అనాల్సిందే

26 Sep, 2022 11:49 IST|Sakshi

దేశంలో సృజనాత్మకతకు కొదవే లేదు. నిత్యం ఎన్నో కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని కొంచెం మేథస్సును జోడించి వినూత్న సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేవారు ఎందరో. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ వ్యక్తి సరికొత్తగా మొబైల్‌ మ్యారేజ్‌ హాల్‌ను తీర్చిదిద్దాడు. 

ఓ ట్రక్కును ఉపయోగించి ఎంతో వినూత్నంగా, ఆకర్షణీయంగా కదిలే బంకెట్‌ హాల్‌ను రూపొందించారు. ఈ కంటైనర్‌ వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా   తీసుకెళ్లవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి వేడుకలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఒక కల్యాణ మండపంలో ఉండే అన్ని సదుపాయాలున్నాయి. అందమైన ఫర్నీచర్‌, స్టైలిష్‌ ఇంటీరియర్స్‌తో దీనిని నిర్మించారు. అంతేగాక ఇది పూర్తి ఎకో ఫ్రెండ్లీ. 

కాగా దాదాపు 40×30 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కళ్యాణ మండపం 200 మందికి సేవలు అందిచగలదు. లోపల చల్లదనం కోసం రెండు ఏసీలనూ '[sg ఏర్పాటు చేశారు. ఈ మొబైల్‌ మ్యారేజ్‌ హాల్‌ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ క్రియేటివిటీని ఆయన కొనియాడారు. దీన్ని రూపొందించిన వ్యక్తిని కలువాలనుకుంటున్నట్లు తెలిపారు.

మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాన్ని అందించడమేకాకుండా పర్యావరణానికి అనుకూలమని తెలిపారు. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంలో ఇలాంటిది శాశ్వత స్థలాన్ని వినియోగించుకోదని పేర్కొన్నారు. ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఈ కళ్యాణ మండపం వీడియో నెటిజన్ల హృదయాలను దోచుకుంటుంది.

మరిన్ని వార్తలు