బాలుడి విన్యాసాలకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా.. వైరలవుతోన్న వీడియో

10 Aug, 2022 15:12 IST|Sakshi

వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను అస్సలు వదలరు. ఇండియాలో పెద్ద బిజినెస్‌ మ్యాగ్నెట్‌ అయినప్పటికీ నిత్యం నెట్టింట్లో ఏదో ఒక వీడియోతో సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. ఆయన షేర్‌ చేసే పోస్టుల్లో సరదాతోపాటు సందేశమూ ఉంటుంది. లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్లు వచ్చి చేరుతుంటాయి. ఇవన్నీ వింటుంటే ఎవరా అని ఆలోచిస్తున్నారా. అతనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా..

ఇటీవల ముగిసిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. దీంతోపాటు ఓ చిన్న పిల్లవాడి విన్యాసాలను తెలిపే వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోలో.. రోడ్డుపై ఓ పదేళ్ల బాలుడు జిమ్నాస్టిక్ స్టంట్లు చేశాడు. అలవోకగా పల్టీలు కొడుతూ, జంప్‌ చేస్తూ వేగంగా ముందుకు వెళ్తున్నాడు. అతడి విన్యాసాలను చూస్తూ చుట్టూ ఉన్న వాళ్లంతా ఆశ్యర్యంతో అలాగే ఉండిపోయారు. 

‘CWG 2022లో బంగారు వర్షం తర్వాత తదుపరి తరం ప్రతిభ రూపుదిద్దుకుంటోంది. దీన్ని ఎవరూ గుర్తించడం లేదు. మనం ఈ ప్రతిభను వేగంగా ట్రాక్‌లోకి తీసుకురావాలి’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. తిరునెల్వేలి సమీపంలోని ఒక గ్రామంలో ఈ అబ్బాయిని చూసిన ఓ స్నేహితుడు ఈ వీడియోను తనకు పంపినట్లు తెలిపారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు బాలుడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు. ఆనంద్‌ మహీంద్రా ఈ బాలుడిని ఆర్థికంగా ఆదుకోవాలని, అతన్ని గొప్ప జిమ్నాస్టిక్‌గా తీర్చిదిద్దడానికి శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు. 
చదవండి: వింత చెట్టు: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో​ వైరల్‌

మరిన్ని వార్తలు