‘బాబా కా దాబా’ వీడియో.. రెస్పాన్స్‌ సూపర్‌

13 Oct, 2020 16:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒక్క వీడియో రాత్రికిరాత్రే ఈ వృద్ధ దంపతుల జీవితాన్ని మార్చేసిందే. 40 ఏళ్లుగా ఢిల్లీలో రోడ్డు పక్కనే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నివసిస్తున్న కాంటా ప్రసాద్‌ అనే వృద్ధుడి వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. కాంత ప్రసాద్‌(90) ఆయన భార్య బాదామి దేవిలు ఢిల్లీలో కాంజీ వడ అమ్ముకుంటున్న వారిని కరోనా కాలం ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నేట్టిసింది. మహమ్మారి కాలంలో వ్యాపారం జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూతను అందించాలంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ గత వారం వీడియో షేర్‌ చేశారు. ఈ హృదయ విదాకర వీడియోకు స్పందించిన నెటిజన్లు వారికి సాయం చేసేందుకు వారి ఇంటి ముందు క్యూ కడుతున్నారు. కరోనా కాలంలో వారి వ్యాపారానికి మద్ధతునిచ్చేందుకు మాల్వియా నగరంలోని ఈ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి మరి ప్రజలు వారి చేతి భోజనం ఆస్వాధిస్తున్నారు. (చదవండి: ‘ప్లీజ్..‌‌ ఇలాంటి వారికి సాయం చేయండి’)

దీంతో కాంత ప్రసాద్‌ ‘బాబా కా ధాబా’ అంటే ఢిల్లీలో తెలియని వారంటు లేరు అనేలా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియా వారిని ఇంటర్య్వూ చేసింది. ఇందులో కాంత ప్రాసాద్‌ వారి చెప్పిన వారి జీవిత కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘ఉత్తరప్రదేశ్‌లో అజాంగఢ్‌లో మా వివాహం జరిగే సమయానికి నాకు 5 ఏళ్లు, బాదామికి 3 ఏళ్లు. అప్పుడు నాకు బాగా గుర్తుండిపోయిన దృశ్యం బాదామికి రబ్బరు బ్యాండ్‌తో జట్టుపైకి కట్టి ఉంది.  ఆమె అప్పుడు అచ్చం రబ్బరు బొమ్మలా కనిపించింది. అది మా వివాహ వేడుక అని తెలియదు. కొత్త బట్టలు ధరించిన ఏదో కార్యక్రమానికి వెళ్లి స్వీట్స్‌ తిని వచ్చామనుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి: అక్షయ్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలి: కేఆర్‌కే)

‘‘మా వివాహం తర్వాత మేము సంవత్సరానికి ఒకసారి కలిసేవాళ్లం. అప్పుడు పాత స్నేహితులం కలుకున్నట్లుగా అనిపించేది. ఈ నేపథ్యంలో నాకు 21 ఏళ్ల వయసు వచ్చాకే బాదామితో నా వివాహం జరిగిందని తెలిసింది. ఆ తర్వాత ఆమె నాతో కలిసి జీవించడానికి వచ్చింది. మా స్నేహం ప్రేమగా మారింది ఇలా మేము కలిసి పెరిగి ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం’’ అంటూ వివరించారు. ఈ క్రమంలో 1961 మాకు కూతురు పుట్టిన అనంతరం అజాంగఢ్‌ నుంచి ఢిల్లీకి వచ్చామని చెప్పారు. మొదట్లో పండ్లు అమ్మేవాడినని ఆ తర్వాత నెమ్మదిగా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లమని చెప్పారు. ఈ క్రమంలో 1990లో బాబా కా ధాబాను ప్రారంభించామ’ని కాంత ప్రసాద్‌ వివరించారు. (చదవండి: వైరల్‌: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..)

మరిన్ని వార్తలు