Video Viral: తమిళనాడు చెస్‌ ఈవెంట్‌ హోర్డులపై మోదీ ఫోటోలు

27 Jul, 2022 12:21 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో 44వ చెస్‌ ఒలింపియాడ్‌ జులై 28న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున్న బిల్‌బోర్డు హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. ఐతే ఈ హోర్డింగ్‌ల్లో మోదీ ఫోటో లేకుండా ఉండటంతో తమిళనాడు బీజీపీ కార్యకర్త  అమర్ ప్రసాద్ రెడ్డి స్టాలిన్‌ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడమే కాకుండా దీన్ని అతి పెద్ద తప్పుగా పేర్కొన్నారు.

అక్కడితో ఆగకుండా మరో ఇద్దరి సన్నిహితులతో కలిసి మోదీ పోటోలను ఆయా హోర్డింగ్‌ బోర్డుల పై అతికించడమే కాకుండా ఆ ఘటన తాలుకా వీడియోలను కూడా సోషల్‌ మాధ్యమాల్లో షేర్‌ చేశారు. పైగా ఈ కార్యక్రమం ప్రభుత్వం స్పాన్సర్‌ చేసే అంతర్జాతీయ కార్యక్రమం కాబట్టి మోదీ ఫోటో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. దీనికిఅంతేగాదు తమిళనాడు అంతటా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ బోర్డులపై తనలా మోదీ ఫోటోలను పెట్టాలని పార్టీ కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఐతే హోర్డింగ్‌లపై ప్రధాని మోదీ చిత్రపటాలను పెట్టడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా అని అడిగితే... మోదీ ఫోటోను ప్రచారంలో భాగం చేయాలా వద్దా అంటూ ఎదురు ప్రశ్నించారు.

వాస్తవానికి తాను ఎలాంటి అనుమతి తీసుకోలేదని, బుధవారం నుంచి హోర్డింగ్‌లపై మోదీ ఫోటోలను పెట్టడం చేస్తున్నాని చెప్పారు. తమిళనాడులో పెద్ద ఎత్తున​ ప్రారంభమవుతున్న ఈ చెస్‌ ఒలింపియాడ్‌ ఆగస్టు 10న ముగుస్తుంది. ఈ ఈవెంట్‌ కోసం తమిళనాడు ప్రభుత్వం దాదాపు 92 కోట్లు ఖర్చు చేస్తోంది. 

(చదవండి: Eknath Shinde: పొలిటికల్‌ హీట్‌ పెంచిన షిండే ట్వీట్‌.. ఉద్ధవ్‌ థాక్రేతో స్నేహం!)

మరిన్ని వార్తలు