Push Ups Viral Video: పెళ్లి దుస్తుల్లోనే వధూవరుల పుష్‌ అప్స్‌.. వారెవ్వా!

27 Aug, 2021 19:54 IST|Sakshi

పెళ్లి అంటేనే సందండి. అందంగా రెడీ అవ్వడం, ఫోటోలు దిగడం, సంతోషంగా గడపడం ఇదంతా సర్వసాధారణమే.. అదే వివాహంలో వర్కౌట్స్‌ చేస్తే ఎలా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది కదూ.. సరిగ్గా ఇలాగే తమ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా రొటీన్‌కు భిన్నంగా ఆలోచించింది ఓ జంట. పెళ్లి మండపాన్ని జిమ్‌గా మార్చి, వేదికపైనే వధూవరులిద్దరూ పుషప్స్‌ చేశారు. పెళ్లి దుస్తు‍ల్లోనే వర్కౌట్స్‌ చేయడం నెటిజన్‌లను సర్‌ప్రైజ్‌ చేస్తోంది. వరుడు కాస్త నెమ్మదిగా పుష్‌ అప్స్‌ చేస్తన్నప్పటికీ వధువు మాత్రం చాలా పర్‌ఫెక్ట్‌గా చేస్తూ వారెవ్వా అనిపించింది.  ఇంతకీ కొత్త జంట పేర్లు చెప్పలేదు కదూ.. వధువు అరోరా వరుడు ఆదిత్య మహాజన్‌.. వీరిద్దరూ ఫిట్‌నెస్‌ కోచ్‌లు.
చదవండి: వైరల్: అదిరిపోయే స్టెప్పుల‌తో మాధురి దీక్షిత్‌ను దించేసిన బామ్మ

ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ..ఈ వీడియోను వధువు అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘కలిసి ఎత్తే జంట చివరికి వివాహంతో ఏకమైంది’ అంటూ షేర్‌ చేయగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌.. ఎన్ని సెట్లు, రరేపెటిషన్స్ అని అడగ్గా.. ‘8 కిలోల లెహంగాతో 1సెట్ 10 రెప్స్ లోడ్ చేసిన పుషప్స్‌’ అని వధువు రిప్లై ఇచ్చింది. దీంతో  8 కిలోల బరువైన వెడ్డింగ్‌ లెహంగాను ధరించి ఈ విధంగా అందరూ చేయలేరని పెళ్లి కూతురిని నెటిజనులు అభినందిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.
చదవండి: బుల్లెట్టు బండి: సూపర్‌.. జూనియర్‌ సాయి పల్లవిలా..

A post shared by Akshita Arora Mahajan | Coach (@fit.arora)

మరిన్ని వార్తలు