వైరల్‌: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తూ బొక్కబోర్లా పడ్డ వధూవరులు..

23 Oct, 2021 19:04 IST|Sakshi

పెళ్లిలో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మారింది. తల వంచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ, పెళ్లి పీటలమీద కూర్చునేది వధువు.. ఇప్పుడు సంగీత్‌లో, పెళ్లిలో స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. పెళ్లి కూతురికి తానేం తక్కువ తీసిపోకుండా వరుడు సైతం డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లిలో డ్యాన్స్‌ వీడియోలు కామన్‌గా మారిపోయాయి. ఈ క్రమంలో ఓ జంట కూడా పెళ్లికి వచ్చిన వారందరిని సందడి చేయాలని అనుకుంది. ఇందుకు పెళ్లి దుస్తుల్లో ముస్తాబై కుటుంబ సభ్యుల మధ్య డ్యాన్స్ వేశారు.
చదవండి: వైరల్‌: నీళ్లలో పాముల సయ్యాట.. ఒళ్లు జలదరించాల్సిందే

కొత్త దుస్తుల్లో మెరిసిపోతూ ఒకరి కళ్లల్లో మరొకరు చూస్తూ నెమ్మదిగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్న ఇక్కడే పొరపాటు జరిగింది. వధూవరులిద్దరూ కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్‌ చేస్తుండగా పొరపాటున కాలు జారీ.. స్టేజీ మీద నుంచి పడిపోయారు. ఊహించని విధంగా జరగడంతో అతిథులంతా షాకయ్యారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలియరాలేదు గానీ.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది.
చదవండి: గిఫ్ట్ బాక్స్ చూసి షాక్‌ అయిన వధువు.. ఇంతకీ అందులో ఏమందంటే..!

A post shared by 🇭🇹 MARIE BLANCHARD🇭🇹 (@haitianbeauty25)

మరిన్ని వార్తలు