పెళ్లిలో ప్రత్యక్షమైన మాజీ ప్రియుడు.. తర్వాత సీన్‌ ఏంటంటే!

17 Jun, 2021 16:20 IST|Sakshi

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఎక్కడ చూసిన వివాహాలు కనిపిస్తున్నాయి. పెళ్లి మండపాలు, పచ్చ తోరణాలతో కనువిందు చేస్తున్నాయి.. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన అనుభూతి. పాత జ్ఞాపకాలకు స్వస్తి చెప్పి, కొత్త జీవితంలోకి అడుగుపెట్టే అద్భుత ఘట్టంగా భావిస్తుంటారు. ఎలాంటి అపర్థాలు లేకుండా కట్టుకున్న వాడితో సంతోషంగా జీవించాలనుకుంటారు. మరి అలాంటి వేడుకలో అనుకోకుండా మాజీ ప్రియుడు కనిపిస్తే వధువు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అచ్చం అలాగే జరిగింది ఓ చోట. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

పాత గుర్తులను మర్చిపోయి వేరే వ్యక్తితో పెళ్లి సిద్ధమైంది ఓ యువతి. వివాహానికి ఇంట్లోవాళ్లు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అయితే అంతలోనే పెళ్లి మండపం వద్ద గతంలో ప్రేమించిన ప్రియుడు ఆమె కన్నుల ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఏం తోచని వధువు కళ్ల నిండా కన్నీటిని నింపుకుంది. అతడు వధువు వద్దకు వచ్చి లడ్డు తినిపిస్తుండగా.. దీనికి ఆమె సున్నితంగా నిరాకరించింది. ఈ క్షణం ఇద్దరి కళ్లలో కన్నీళ్లు తెచ్చుకొని ఉద్వేగానికి లోనయ్యారు. వెంటనే అతడు గుండెల నిండ బాధ, కన్నీటితో అక్కడి నుంచి వెనుదిరిగాడు. బ్యాగ్రౌండ్‌లో ‘తుమ్‌కో ముబారక్‌ హో యే షాదీ తుమ్హారీ’ అనే పాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీరి ప్రేమను చూసిన నెటిజన్లు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు.

చదవండి: ‘పెళ్లికి చెప్పినంత ఖర్చు పెడతారా.. లేదా లేచిపొమ్మంటారా?!’

A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు