వైరల్‌: నాకే చోటులేదా.. వధువు చేసిన పనికి నవ్వులే నవ్వులు!

17 Jun, 2021 19:19 IST|Sakshi

భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. తమ ఇంటి ఆడబిడ్డను అత్తారింటికి పంపే వేడుకను తమకు తోచినంతలో ఘనంగా జరిపించాలని ఆరాటపడతారు ప్రతీ తల్లిదండ్రులు. ఇక పెళ్లి జరిగే సమయంలో సరదాలు.. సంతోషాలతో పాటు.. భావోద్వేగాలతో మంటపంలో ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం ఉంటుంది. దానిని తేలిక చేసేందుకు స్నేహితులో.. బంధువులో పూనుకోవడం సహజం. అదే విధంగా రిసెప్షన్‌ సమయంలో నూతన వధూవరులను పక్కపక్కనే కూర్చోబెట్టి ఫొటోలు దిగుతారు బంధుమిత్రులు. అయితే, తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో తనకు భర్త పక్కన చోటు దక్కకపోవడంతో వధువు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. 

వేదిక మీదకు వచ్చి వరుడి పక్కన కూర్చునేందుకు కొత్త పెళ్లికూతురు సిద్ధం కాగా.. అతడి స్నేహితులు ఆమె స్థానాన్ని ఆక్రమించారు. పెళ్లికొడుకు పక్కన అటొకరు.. ఇటొకరు కూర్చున్నారు. ఈ విషయాన్ని గమనించిన వధువు.. చిరుకోపంతో వాళ్లవైపు ఓ లుక్కేసింది. అయినప్పటికీ వారిలో స్పందన లేదు. దీంతో, ఆమె చటుక్కున వరుడి ఒడిలో ఆసీనురాలై ఫొటోలకు ఫోజులివ్వడం మొదలుపెట్టడంతో నవ్వడం వారి వంతైంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరె నాకే చోటు ఇవ్వరా.. ఉండండి మీ పని చెప్తా అన్నట్లు.. వధువు చూపించిన ఆటిట్యూడ్‌ సూపర్‌. మీ జంట ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ‘పెళ్లికి చెప్పినంత ఖర్చు పెడతారా.. లేదా లేచిపొమ్మంటారా?!’
ముద్ద నోట్లో పెట్టుకుందామనుకుంది.. అంతలోనే దాపురించాడు!
పెళ్లిలో ప్రత్యక్షమైన మాజీ ప్రియుడు.. తర్వాత సీన్‌ ఏంటంటే!

మరిన్ని వార్తలు