దున్నపోతు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్‌ వీడియో

20 Dec, 2021 16:44 IST|Sakshi

సాధారణంగా కొన్ని సందర్భాల్లో సాటి మనుషులే.. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు మనకేందుకులే అని వదిలేస్తారు. అయితే, ఒక మూగ జీవి మాత్రం ఆపదలో ఉన్న సాటి జీవికి సహయం చేసి మనుషులు తమ ప్రవర్తనను మార్చుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, దున్నపోతులు కొన్ని సందర్భాల్లో కోపంగా ప్రవర్తిస్తుంటాయి. ఆ సమయంలో వాటికి ఎదురుగా ఎవరున్నా కోపంతో పైకి ఎత్తి కిందపడేస్తాయి.

కొన్ని చోట్ల దున్నపోతుల పోటీలను నిర్వహిస్తుంటారు. వీటిలో వాటిని ఎరుపు వస్త్రం చూపించి, దాన్ని రెచ్చగొట్టేలా చేసి.. లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ఆటలో ఒక్కొసారి అనుకొని సంఘటనలు చోటు చేసుకున్నవిషయం మనకు తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం.. ఒక దున్నపోతు తనకు ఎదురుగా ఉన్న ఒక జీవిని.. కోపంగా కుమ్మకుండా ప్రశాంతంగా దాని ప్రాణాలను కాపాడింది.

వివరాలు.. ఈ వీడియోలో ఒక నలుపు రంగు దున్నపోతు, దాని ముందు ఒక తాబేలు ఉన్నాయి. పాపం.. తాబేలు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి బోర్లాపడింది. ఎంత ప్రయత్నించిన పైకి లేవలేకపోయింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దీన్ని గమనించిన ఒక దున్నపోతు.. వెంటనే అక్కడికి వెళ్లి తన కొమ్ములతో తాబేలుకు ఆనించి..  పైకి లేచేలా చేసింది. దీంతో ఈ సంఘటనను చూస్తున్న అక్కడి వారంతా అభినందిస్తు కేకలు వేశారు.

అయితే, దీన్ని గతంలో మనస్కామ్రాన్‌  అనే టిక్‌ టాక్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొందరు మనుషుల కంటే నోరులేని జీవాలే నయం అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు