పులినే రమ్మంటూ బస్‌ విండో తెరిచాడు... అంతే ఒక్క జంప్‌ చేసి...

5 Aug, 2022 20:24 IST|Sakshi

క్రూరమృగాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అంతే సంగతులు. ఒక్కోసారి ఏ  జరుగుతుందో కూడా ఊహించలేం. ఇక్కడొక వ్యక్తి చిన్న మాంస ముద్దతో ఉన్న స్టిక్‌ని ఎర చూపి బస్‌ విండో తీసి మరీ రమ్మంటూ సైగ చేశాడు. అంతే ఆ తర్వాత ఘటన చూస్తే షాక్‌  అయిపోతాం.

ఏం జరిగిందంటే...ఒక వ్యక్తి కారు విండో కొద్దిగా తెరిచి పులిని రమ్మంటూ ఒక మాంస ముద్ద ఉన్న స్టిక్‌ని చూపిస్తాడు. అంతే పులి వేగంగా వస్తూ.. ఒక్క జంప్‌ చేసి విండో వద్ద నుంచుని ఆ స్టిక్‌ని లాగేసుకుంటుంది. అంతే అతను ఆ హఠాత్పరిణామానికి భయపడుతూ...నెమ్మదిగా డోర్‌ వేసేసుకుంటాడు.

లేదంటే ఇక అంతే సంగతులు. అయినా క్రూర మృగాలతో పరాచాకాలంటే ప్రాణాలతో చెలగాడటమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వ్యక్తి కి ఎంత థైర్యం ఏదైనా జరిగితే అంటూ నెటిజన్లు చివాట్లు పెడుతూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి:  ఇంద్రుడి ఐరావతం భూమిపై పుట్టింది! ఏడు రకాల ప్రత్యేకతలు కూడా.. )

A post shared by the amazing tigers (@the_amazing_tigers)

మరిన్ని వార్తలు