‘ఎంజాయ్‌ ఎంజామీ’ అంటోన్న చెన్నై మహిళా పోలీసులు

9 May, 2021 14:15 IST|Sakshi

చెన్నై: భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం నాలుగు లక్షల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కోవిడ్‌పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఎక్కవ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం కరోనా పెరిగేందుకు కారణాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై రైల్వే పోలీసులు కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనే దానిపై అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ఆలోచించారు. చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో యూనిఫాం, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌవ్స్‌  ధరించి పోలీసులు డ్యాన్స్‌ చేశారు. 

పోలీసు అధికారులంతా ‘ఎంజాయ్ ఎంజామి’ అనే పాపులర్‌ పాటకు స్టెప్పులు వేశారు. వీరంతా మహిళా పోలీసు అధికారులే కావడం విశేషం. డ్యాన్స్‌తోపాటు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటింజడం వంటివి కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏ విధంగా సాయపడుతుందో తెలిపేందుకు ఓ స్కిట్‌ను రూపొందించారు. పోలీసుల ప్రదర్శన ప్రయాణీకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.  కాగా దీనికి ముందు కూడా కేరళ పోలీసులు ఇదే పాటకు డ్యాన్స్‌​ చేస్తూ ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించారు.

చదవండి: సీఎంని కదిలించిన 10 ఏళ్ల బాలుడి పరిస్థితి.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు