హృదయ విదారకం..కూతురి శవాన్ని భుజాన వేసుకుని కాలినడకతో...

26 Mar, 2022 11:40 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌: మనం ఇంతవరకు ఎన్నో హృదయ విదారక ఘటనలు చూశాం. ఒక్కోసారి కొన్ని ఘటనలు మనసున మెలి పెడుతున్నంత బాధను మిగిలిస్తే, మరికొన్ని మనం వారిని ఆదుకునే స్థితిలో ఉన్నా అవకాశం దొరకదు. అచ్చం అలాంటి ఘటనే చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ఛత్తీస్‌గఢ్‌లోని లఖన్‌పూర్‌లో ఆమదాల గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ అనారోగ్యంతో ఉన్న తన కుమార్తె సురేఖను తెల్లవారుజామున లఖన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అయితే ఆ అమ్మాయికి ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో వైద్యులు ఆమెకు తక్షణ చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. అయితే ఆమె గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారని డాక్టర్‌ వినోద్‌ బార్గవ్‌ అన్నారు. అయితే అంబులెన్స్‌ వచ్చేలోపే ఆమె తండ్రి మృతదేహాన్ని భుజాన వేసుకుని కాలినడకన సుమారు 10 కి.మీ దూరంలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లిపోయాడు.

ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌ తెగ వైరల్‌ అవ్వడంతో ఆరోగ్య మంత్రి టీఎస్‌ సింగ్‌ విచారణకు ఆదేశించారు. అంతేకాదు ఈ విషయంపై విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ను కోరారు కూడా. డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బంది వాహనం కోసం వేచి ఉండేలా కుటుంబాన్ని ఒప్పించి ఉండాలి అలాంటివి జరగకుండా చూసుకోవాలి అని మంత్రి అన్నారు.

(చదవండి: అతను అలా ఉండటం వల్లే...మంత్రి పదవి దక్కింది)

మరిన్ని వార్తలు