వైరల్‌: కార్యకర్త చెంప చెల్లుమనిపించిన డీకే శివకుమార్‌

10 Jul, 2021 14:54 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివ కుమార్‌ సహనం కోల్పోయి పార్టీ కార్యకర్తపై అనుచితంగా ప్రవర్తించారు. శివకుమార్‌ పక్కన నడుస్తున్న వ్యక్తి ఆయన భుజాలపై చేయి వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ నాయకుడు కార్యకర్త చెంపచెల్లుమనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో జర్నలిస్టులు అక్కడే ఉండటంతో వీడియోను డిలీట్‌ చేయాలని మీడియాతో శివ కుమార్‌ వాగ్వాదానికి దిగారు. అనంతరం భౌతిక దూరం పాటించనందుకు తనకు కోపం వచ్చిందని, అందుకే అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చుకున్నారు.

కాగా శివకుమార్‌ ప్రముఖ రాజకీయవేత్త, మాజీ మంత్రి డీ మడే గౌడ ఆర్యోగ్యంపై ఆరా తీసేందుకు మాండ్య వెళ్లారు.  ఈ వీడియోలో శివకుమార్‌కు అనుకొనే నడుస్తున్నట్లు కనిపిస్తున్న ఓ కార్యకర్త తన చేతిని నాయకుడి భుజాలపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్‌ కార్యకర్త చెంప పగలగొట్టి.. జనాల మధ్య ఎలా నడుచుకోవాలో తెలిపాడు.కాగా శివకుమార్‌ అనుచితంగా ప్రవర్తించడం ఇదేం తొలిసారి కాదు. 2018లో బళ్లారిలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు