వైరల్‌: కాకి తెలివికి మెచ్చుకోవాల్సిందే!

26 Mar, 2021 13:25 IST|Sakshi

కాకి మీద బోలెడు సామెతలున్నాయి. కాకి పిల్ల కాకికి ముద్దు, కాకి గూటిలో కోయిల పిల్లలాగా, కాకి ముక్కుకు దొండ పండు, కాకిలా కలకాలం మన్నేకంటే హంసై ఆరు నెలలున్నా చాలు, కాకులను కొట్టి గద్దలకు వేయడం, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు, కాకమ్మ కబుర్లు.. అబ్బో ఇలానే చాలానే ఉన్నాయి. అయితే ఈ వార్త చదివాక ఆ లిస్టులో కాకి తెలివితేటలు అనే సామెత కూడా చేర్చాలంటున్నారు కొందరు జనాలు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

కుండ అడుగులో ఉన్న నీళ్లను తాగేందుకు ఓ కాకి అందులో రాళ్లు వేసి నీళ్లు పైకి రాగానే ఎంచక్కా తాగేసిందనే కథ బాల్యంలో దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే ఇక్కడ చెప్పుకునే కాకి మాత్రం అలా పెద్దగా కష్టపడకుండా ఈజీగా తన దాహం తీర్చుకుంది. ఎక్కడినుంచో ఎగురుకుంటూ వచ్చి ఓ కుళాయి మీద కూర్చున్న కాకి తన కాళ్లతో దాహార్తిని తీర్చుకుంది.

కాళ్లతో బలంగా ఆ కుళాయిని తిప్పడంతో అందులో నుంచి నీళ్లు రాగా, వాటిని ఎంచక్కా తాగి దప్పిక తీర్చుకుంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా చివర్లో ఆ కుళాయిని కట్టేసిందా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియోను అటవీశాఖ అధికారి సుశాంత్‌ నందా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. కాకి తెలివి చూసిన నెటిజన్లు 'దీని తెలివి సల్లగుండ..' అని అబ్బురపడుతూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం అది కుళాయి బంద్‌ చేయలేదంటూ కాకి మీద చిరుకోపం ప్రదర్శిస్తున్నారు.

చదవండి: ఇది ఏ‘కాకి’ కాదు!

రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం!

మరిన్ని వార్తలు