Viral Video: విద్యార్థిని బ్యాగ్‌లో పాము కలకలం.. జస్ట్‌ మిస్‌ లేదంటే...:

26 Sep, 2022 15:11 IST|Sakshi

ఒక విద్యార్థిని బ్యాగ్‌లో పాము పెద్ద కలకలం సృష్టించింది. ఆమె తన బ్యాగ్‌లో ఏదో మెదలుతుందని గ్రహించకుండా ఉండి ఉంటే ఆ పాఠశాల్లోని విద్యార్థులు, టీచర్లు ఏమై ఉండేవారో ఊహించడానికే భయంగా ఉంది కదా!. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో షాజ్‌పూర్‌లోని బడోని స్కూల్‌లో చోటు చేసుకుంది. ఉమా రజాక్‌ అనే పదో తరగతి విద్యార్థి తన బ్యాగ్‌లో ఏదో మెదులుతున్నట్లు అనిపిస్తోందని టీచర్‌కి చెప్పింది.

అతడు ఆ స్కూల్‌ బ్యాగ్‌ని పూర్తిగా క్లోజ్‌చేసి ఆరుబయటకు తీసుకువచ్చి నెమ్మదిగా జిప్‌ ఓపెన్‌ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అందులో ఉన్న పుస్తకాలన్నీ తీసేశాడు. ఆ తర్వాత బ్యాగ్‌ని తలకిందులుగా చేసి దులపగానే ఒక్కసారిగా తాచుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఒక్కసారిగా విద్యార్థులు, సదరు ఉపాధ్యాయుడు షాక్‌ అయ్యారు.

ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి చెప్పినదాన్ని సీరియస్‌గా తీసుకోకుండా ఉండి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం సంభవించిందో చెప్పనవసరం లేదు. అదీగాక అదృష్టవశాత్తు ఆ పాము ఆ బ్యాగ్‌ నుంచి బయటపడ్డాక వారిపై దాడి చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. మీర కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పట్టా )

మరిన్ని వార్తలు