నీటిలో గాలి బుడగలు ఊదుతున్న శునకం.. ఫన్నీ వీడియో..

17 Jun, 2021 13:08 IST|Sakshi

మనలో చాలా మందికి నీటిలో ఆడుకోవడమంటే మహా సరదా. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నీళ్లలో గడపటానికి తెగ ఇ‍ష్టపడతారు. అందుకే, చాలా మంది స్నానమనే వంకతో గంటల కొద్ది బాత్రూంలలో గడిపేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, నీళ్లలో ఆడుకోవడం మనుషులకే కాదూ.. నోరులేని జీవాలకు కూడా ఇష్టమే. అందుకే అడవిలోని చాలా జంతువులు నీరు కనిపించగానే నీళ్లలో దిగి  సేద తీరుతుంటాయి. ఈ క్రమంలో, ఇప్పటికే అనేక జంతువుల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  తాజాగా, ఇలాంటి  కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

వివరాలు..ఈ వీడియోలో ఒక శునకం పొలం గట్టున కట్టేసి ఉంది. దాని పక్కనే కాలువ ప్రవహిస్తుంది.  అయితే, ఎండ వేడికి బాగా అలసిపోయిందో.. ఏమో కానీ.. ఆ శునకం ఏంచక్కా కూర్చుని.. అటూ ఇటూ చూస్తూ సేద తీరుతుంది. అంతటితో ఆగకుండా అది నీటిలో మూతిపెట్టి గాలిని వదిలింది. ఈ క్రమంలో కొన్ని గాలి బుడగలు వచ్చాయి. ఆ శునకం ఇదేం వింత అని చూసి.. మరోసారి నీటిలో అలాగే చేసింది.

ఈసారి కూడా నీటిలో బుడగలు వచ్చాయి. అయితే, ఈ వీడియో ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు. కాగా, ఈ ఫన్నీ వీడియోను ఫ్రెడ్‌ స్కూజ్‌ అనే వ్యక్తి ‍తన ‍‍ట్విటర్‌ ఖాతాలో ​పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, ‘వావ్‌.. శునకం నీటిలో ఎంత బాగా సేదతీరుతుంది..’,‘ఈ వీడియోను చూసి వీలైతే నవ్వు ఆపుకోండి.. చూద్దాం..’, ‘నీటిలో బుడగలు.. మీరేనా.. నేను తెప్పిస్తాను.. అని చూయిస్తుందేమో..’, ‘శునకం.. ఎంత క్యూట్‌ గా ఉంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: ఆకలితో వచ్చిన పక్షి.. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

మరిన్ని వార్తలు