Viral Video: తప్పతాగి రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డుపై పోలీస్ కాలర్ పట్టుకొని..

20 Jun, 2022 19:56 IST|Sakshi

మద్యం తాగి వాహనం నడపడం నేరం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా ఎంతో మంది జనాలు దీనిని పట్టించుకోకుండా ఫంక్షన్లు, పార్టీలంటూ ఫుల్‌గా తాగి రోడ్డుపైకి వస్తుంటారు. తాగి నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు అవుతుంటాయి. వీటిని అరికట్టేందుకు పోలీసులు డ్రంక్‌ డ్రైవ్‌లను పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన మందుబాబుల ప్రవర్తనల్లో మార్పులు రావడం లేదు. కొంత మంది  తాగి బండి నడపడమే కాకుండా.. ఎదురు పోలీసుల మీదే తిరగబడుతుంటారు. అచ్చం ఇలాగే మద్యం మత్తులో ఓ యువతి పోలీసు అధికారితో రెచ్చిపోయి ప్రవర్తించింది.

ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. ఫుల్‌గా తాగిన ఓ యువతి కారు డ్రైవ్‌ చేసుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది. తాగిన మైకంలో అందరిని తిడుతూ నానా హంగామా చేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  అయితే పోలీసుల రాకతో ఆవేశంతో ఊగిపోయిన సదరు యువతి.. తాగిన మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియకుండా ప్రవర్తించింది. విధుల్లో ఉన్న పోలీసు పట్ల నడి రోడ్డుపై దురుసుగా ప్రవర్తించింది. ఆయన కాలర్‌ పట్టుకొని బెదరిస్తూ వాగ్వాదానికి దిగింది. పోలీస్‌ అధికారి జుట్టు పట్టుకొని తన్నేందుకు ప్రయత్నించింది. అంతటితో ఆగకుండా చివర్లో పోలీస్‌ ధరించిన మాస్క్‌నే లాక్కొని పడేసింది.

అయితే ఇంత జరుగుతున్న ఆ పోలీస్‌ అధికారి ఆమెను ఏం అనలేదు. మహిళ కావడంతో అతను సైటెంట్‌ ఉన్నారు. యువతి మీద మీదకు వస్తుంటే ఆమెను దూరంగా జరిపారు. యువతి ప్రవర్తిస్తున్న తీరును కొంతమంది తమ ఫోన్‌లో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్ట్‌ తన ట్విటర్‌లోషేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి కావడంతో ఆ పోలీస్‌ అధికారి నిస్సహయంగా ఉండి పోయారని లేకుండే మరోలా ఉండేదని కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: Viral Video: హ్యాట్సాఫ్‌ సార్‌! స్వయంగా చేతులతో డ్రైయిన్‌ని క్లీన్‌ చేసిన ఆఫీసర్‌

మరిన్ని వార్తలు