బెడ్‌ కోసం ఫైట్‌ చేసిన ఏనుగు: వీడియో వైరల్‌

17 May, 2022 21:38 IST|Sakshi

Elephant immediately tries to get the "sleeping" man off: జంతువులను ప్రేమగా చూసుకుంటూ ఉంటే అవి కూడా మన స్నేహితుల మాదిరిగా అయిపోతాయి. కొన్ని రోజులకు అవి జంతువులు అనే ఫీలింగ్‌ కూడా రాదు. మనం ఎలా అలవాటు చేస్తే అవి కూడా వాటికి తగ్గట్టుగా తమను మార్చుకుంటాయి. మన స్నేహితుల మాదిరి మనతో సరదాగా పోట్లాడతాయి కూడా. ఈ ఏనుకు కూడా అలానే తన సంరక్షకుడితో పొట్లాడుతోంది.

వివరాల్లోకెళ్తే...ఇక్కడొక బేబి ఏనుగు బెడ్‌ పై  సంరక్షకుడు సరదాగా కాసేపు పడుకుంటాడు. అక్కడ తన తల్లితో ఆహారం తింటున్న పిల్ల ఏనుగు ఈ ఘటనను చూసి వెంటనే వచ్చేస్తుంది. పైగా అడ్డుగా ఉన్న ఫెన్సింగ్‌ని కూడా దాటి మరీ వచ్చి తన సంరక్షకుడితో దెబ్బలాడుతోంది. అతను లేచి వెళ్లిపోయేంతవరకు వదలదు. చివరికి ఇద్దరు కలసి బెడ్‌ మీద పడుకుంటారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారతీయ అటవీ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ ట్విట్టర్‌లో పోస్ట్‌  చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది)

మరిన్ని వార్తలు