గిట్టుబాటు ధర లేక 160 కేజీల ఉల్లిపాయల్ని తగలబెట్టిన రైతు!!

19 Dec, 2021 14:31 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లోని ఒక యువ రైతు రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందసౌర్‌ బహిరంగ వేలంలో 160 కిలోల వెల్లుల్లిని తగలబెట్టి తన పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదన్న విషయాన్ని  బహిరంగంగా వ్యక్తం చేశాడు. డియోలీకి చెందిన శంకర్ సిర్ఫిరా తన ఉత్పత్తులను మందసౌర్ మండిలో హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు  తీవ్ర నిరాశకు గురై ఈచర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత రైతు  'జై జవాన్ జై కిసాన్' అంటూ నినాదం చేశాడు. అయితే మండిలోని సిబ్బంది ఇతర రైతులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో ఎటువంటి నష్టం జరగకుండా నిరోధించారు.

(చదవండి: బాప్‌రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్‌ వీడియో)

ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఇక్కడ వెల్లుల్లి పంటను రవాణా చేయడానికి రూ. ఐదు వేల రూపాయాలు ఖర్చు పెట్టాను. కానీ కొనుగోలుదారుల నుండి రూ. 1,100 మాత్రమే పొందుతున్నాను. అందువల్ల కాల్చడం మంచిది అనిపించి ఇలా చేశాను. అంతేకాదు నేను వెల్లుల్లిని పండించడానికి రూ. 2.5 లక్షలు ఖర్చు చేశాను. అయితే నాకు మార్కెట్‌ ధర ప్రకారం కేవలం రూ.1 లక్ష మాత్రమే వచ్చింది," అని ఆవేదనగా శంకర్ చెప్పారు.

ఈ క్రమంలో రైతును విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే  పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి జితేంద్ర పాఠక్ ఇతర రైతుల ఉత్పత్తులకు అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు కాబట్టి ఆ రైతు పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని అన్నారు. ఏదిఏమైన రైతులు సరైన గిట్టుబాటు ధర లభించక ఆగ్రహంతో పంటను దహనం చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది.

(చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!)

మరిన్ని వార్తలు